Facial Beauty Scrub: వర్షాకాలం వచ్చిందంటే చెమటలు ఎక్కువగా పట్టవు. దీంతో వ్యర్ధ పదార్ధాలన్ని, టాక్సిన్స్ అన్ని చర్మ రంధ్రాల్లో పేరుకుపోయి.. కాస్త ఇరిటేషన్స్ కూడా వస్తుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే.. స్కిన్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా మారుతూ ఉంటుంది. కాబట్టి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి క్లీన్ చేసే టెక్నిక్స్‌లో.. నాచురల్ స్కిన్ స్క్రబ్బింగ్‌ని వాడండి.. మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం తెల్లగా, మెరిసిపోతుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శెనగపిండి, పసుపు, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్
శెనగపిండి రెండు టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె కొంచెం, పసుపు చిటికెడు కలిపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత మెల్లగా మసాజ్ చేస్తూ.. శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మ రంధ్రాలు ఓపెన్ అయ్యి.. ట్యాక్సిన్స్ వ్యర్ధాలన్ని బయటకు వస్తాయి. ఇందులో ముఖ్యంగా కొబ్బరి నూనె వల్ల చర్మం చాలా స్పూత్‌గా ఉంటుంది. ఈ కొబ్బరి నూనె దురదలు రాకుండా.. ఇరిటేషన్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపు అనేది వర్షాకాలంలో వచ్చే వైరస్, బ్యాక్టీరియల్, ఫంగస్‌ల నుంచి.. చర్మాన్ని రక్షించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక శెనగపిండి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ముఖంపై చర్మ రంధ్రాలని, డెడ్ సెల్ లేయర్‌ను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.
అలోవెరా, పసుపు, తేనె ఫేస్ ప్యాక్
ముందుగా చిన్న గిన్నె తీసుకుని.. అందులో ఫ్రెష్ కలబంద గుజ్జు, పసుపు కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకునే ముందు వేడినీళ్ల ఆవిరి పట్టండి. చర్మ రంధ్రాల్లో ఉండే వ్యర్ధాలన్ని చెమట రూపంలో బయటకు పోతాయి. ఆ తర్వాత అలోవెరా, పసుపు కలిపిన మిశ్రమాన్ని తీసుకుని చక్కగా ముఖానికి, మెడకు అప్లై చేసి.. 25 నిమిషాలు లేదా అరగంట పాటు ఉంచుకోండి. తర్వాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోండి. పగలంతా పొల్యూషన్‌లో తిరిగి వస్తుంటారు కాబట్టి.. రాత్రి సమయంలో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నారంటే.. డెడ్ సెల్స్, టాక్సిన్స్ తొలగిపోయి ఫ్రెష్ స్కిన్ ఉంటుంది. మంచిగా నిద్ర కూడా పడుతుంది. ఆవిరి పట్టుకోవడం వల్ల బ్రీతింగ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఖర్చులేని ఈ నాచురల్ హోమ్ రెమిడీనీ మీరందరు ఒకసారి ట్రై చేసి చూడండి.
పసుపు, పాలు, నిమ్మరసం ఫేస ప్యాక్
పసుపు రెండు టీస్పూన్లు తీసుకుని.. అందులో రెండు టీ స్పూన్లు పాలు, కొంత నిమ్మరసం కలిపి ఈ మూడింటి మిశ్రమాన్ని.. బాగా పేస్ట్ లాగా కలిపిన తర్వాత ముఖానికి పెట్టుకోండి. సుమారు ఒక అరగంట పాటు ఉంచి శుభ్రం చేసుకుంటే.. రీహైడ్రేషన్ సెల్స్‌ను హైడ్రేట్ చేసి.. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
Also Read: బెస్ట్ కొరియన్ ఫేసియల్స్ టిప్స్.. అంతులేని తెల్లటి స్కిన్ మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.