Illu Illalu Pillalu Today Episode june 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ధీరజ్ కలిసి రావడం చూసి వేదవతి సంతోషంతో పొంగిపోతుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసిపోయారని ఆనందంతో గంతులు వేస్తుంది. రామరాజు వేదవతిని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి విచిత్రం మీ ఇద్దరు కలిసి రావడం ఏంటి అని వేదవతి సంతోషంతో ఉరకలేస్తుంది. అయితే ఇక మీద నుంచి విని డెలివరీ బాయ్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు చెప్పు బుజ్జమ్మ అని అంటాడు. ఈ వేదవతి మీరే కదా వాడ్ని నెలకు వాళ్ళ ఖర్చులకు సరిపోయిన డబ్బులు ఇవ్వమని అడిగారు. ఇప్పుడు మళ్లీ ఇలా అంటున్నారు ఏంటి అని అంటుంది. సైకిల్ మీద కష్టపడుతూ ఇంటింటికి వెళ్లి ఫుడ్ డెలివరీ చేసే అంత గతిని పట్టలేదు రామరాజు కొడుకులు కి అని అంటాడు. ఇకమీదట వాడి ఖర్చులు వాడి భార్య ఖర్చులు అన్నీ నేనే చూసుకుంటాను సాగర్ లాగా మిల్లు కొచ్చి ఏదో ఒక పని చేసుకోమను కాలేజ్ అయిన తర్వాత అని అంటాడు. ఆ మాట విని అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ధీరజ్ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోడు. అందరూ ఎంత చెప్పినా కూడా ధీరజ్ మొండిగానే ఉంటాడు. నేను అలాంటి పని చేయలేను అని చెప్పేస్తాడు. ఆ మాట వినగానే రామరాజు కోపంతో ధీరజ్ని కొడతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు మాట వినలేదని ధీరజ్ పై కోపంగా అరుస్తూ మిల్లుకు వెళ్తాడు. వెనకాల కూర్చున్న తిరుపతి ఎందుకు బావ అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతాడు. నా కోపానికి కారణం ఏంటో నీకు తెలియదా? ఈరోజు నా మాట వినకుండా తను ఇష్ట ప్రకారమే చేయాలని అనుకుంటున్నాడు. నేను వాడు ఇంటింటికి వెళ్లి కష్టపడుతున్నాడని వాడికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన కూడా వాడు నా మాట అంటే లెక్కచేయకుండా ఉన్నాడు అని రామరాజు అంటుంటాడు. ధీరజ్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు బావ అని అంటాడు. ఎంత చెప్పినా కూడా రామరాజు నా మాటే నెగ్గాలి అని అనడంతో తిరుపతి ధీరజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు.
అది విని తట్టుకోలేక పోయిన రామరాజు. ఏంట్రా నువ్వు మాట్లాడేది నీ మేనల్లుడ్ని అరుస్తున్నానని నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నావా అని అరుస్తాడు. అయితే నీ వారసత్వాన్ని మాత్రమే కాదు బావ నీ మొండితనాన్ని కూడా ఇచ్చావు. ఈరోజుల్లో అబ్బాయిలు ఎవరు తండ్రి మాట వింటున్నారు వాళ్ళకి నచ్చినట్లు చేయాలనుకుంటారు కదా.. పెళ్లయిన తర్వాత కొడుకు మీద చేయి చేసుకుంటే కోడలు ముందు అతనికి గౌరవం ఏమంటుంది ఆలోచించు బావ అని అంటాడు. ఏది ఏమైనా కూడా నా కొడుకు నేను కంట్రోల్ లోనే పెట్టుకుంటాను అని రామరాజు అంటాడు.
ఇక వేదవతి తండ్రి కొడుకులు మధ్య మళ్లీ గొడవ వచ్చిందని బాధపడుతూ ఉంటుంది. చేతికి అంది వచ్చిన కొడుకును పట్టుకొని కొట్టడం ఏంటి అని వేదవతి బాధ పడుతూ ఉంటుంది. అయితే ప్రేమ కూడా బాధపడుతూ ఉంటుంది. వీరిద్దరిని చూసిన నర్మదా అయిందేదో అయిపోయింది ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది అని అంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటావే? కొడుకుని కోపంతో అలా కొడితే ఎవరైనా బాధపడతారు కదా అని వేదవతి అంటుంది.
అప్పుడే అటు వచ్చిన శ్రీవల్లి వేదవతిని చూసి సంతోషపడుతుంది. తండ్రి కొడుకులు గొడవపడ్డారని ఏమో బాధపడుతుందేమో కాస్తంత ఓదార్పునిస్తే మన మాట వింటుంది కదా అని అనుకుంటుంది. అయితే బాధపడకుండా ఎలా ఉంటారు. నర్మదా ధీరజ్ తండ్రి మాటను ఎదిరించి ఇలా మాట్లాడటం తప్పు కాదా.. అందుకే అత్తయ్య గారు చాలా బాధపడిపోతున్నారు అని శ్రీవల్లి అంటుంది. నువ్వు ఎందుకు అక్క మధ్యలో దూరిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావని ప్రేమ రెచ్చిపోయి శ్రీవల్లికి గట్టిగానే బుద్ధి చెబుతుంది..
Also Read :తండ్రి కడుపునింపిన ఆరాధ్య..అక్షయ్ కు రాజేంద్ర ప్రసాద్ షాక్.. చిచ్చు పెట్టిన పల్లవి..
ఇక్కడ కూడా మీరందరూ గొడవపడాలా అని వేదవతి అంటుంది. అటు ముగ్గురు అన్నదమ్ములు ఒక చోటికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న మాటను ఎదిరించడం తప్పు కాదని చందు అనగానే.. ధీరజ్ ఒకసారి ఆయన మిల్లుకు రావాలి అంటాడు. మరొకసారి నాకు నీకు ఏ సంబంధం లేదు నువ్వు సంపాదించి ఇవ్వాలి అని అంటాడు. ఇలా ఒక్కసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ ప్రతిసారి ఇలా అంటూ ఉంటే ఎలా ఆయన మాటను వినాలి అన్నయ్య. నాక్కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా అని ధీరజ్ అనగానే అన్నదమ్ములు నీ ఇష్టం రాని వదిలేస్తారు. ఇక వేదవతి తండ్రి కొడుకులను ఒకచోట చేర్చి కలపాలని ప్లాన్ వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..