Oils For Skin Glow: ముఖం ఎంత అందంగా ఉన్నా దానిపై నల్లటి వలయాలు, ముడతలు, సన్నని గీతలు ఉంటే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటి సమయంలోనే ప్రతి ఒక్కరూ తమ ముఖాన్ని మచ్చ లేకుండా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇదిలా ఉంటే.. చర్మంపై హైడ్రేషన్ లేకపోవడం వల్ల కూడా ముడతలు వస్తాయి.
ముఖం మీద తేమ తగ్గడం ప్రారంభించినప్పుడు, చర్మంపై సన్నని గీతలు కనిపించడం మొదలవుతుంది. ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక ముఖ్యమైన నూనెల గురించి ప్రస్తావించబడింది. ఇవి ముఖానికి సహజ తేమను అందించడంతో పాటు చర్మ సమస్యలను కూడా తొలగిస్తాయి. మరి ముఖ సౌందర్యానికి ఉపయోగపడే ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం నూనె:
బాదం నూనె చర్మానికి కూడా మంచిదని భావిస్తారు. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు బాదం నూనెలో పొటాషియం, జింక్ , ప్రోటీన్ కూడా ఉంటాయి. అందుకే ఈ ఆయిల్ వాడటం ద్వారా చర్మం యవ్వనంగా , దృఢంగా మారుతుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆలివ్ నూనె:
ఆలివ్ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటివి ఉన్నాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుతాయి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అంతే కాకుండా ముడతలు, గీతల సమస్య క్రమంగా తగ్గుతుంది. ఆలివ్ నూనెలో ఉండే పాలీఫెనాల్స్ , విటమిన్ E చర్మ కణాలు, వృద్ధాప్యానికి ప్రధాన కారణమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
రోజ్‌షిప్ సీడ్ ఆయిల్:
ఆయుర్వేదంలో రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ చర్మ పోషణలో చాలా ప్రభావ వంతంగా ఉంటుందని చెప్పబడింది. ఈ రోజుల్లో రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ నూనెను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారీలో కూడా వాడుతున్నారు. ఇది చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ నూనెలో మాయిశ్చరైజింగ్ చ యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. దీంతో పాటు ఇందులో ప్రొవిటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు , గీతలను తగ్గించడంలో సహాయపడతాయి.
క్యారెట్ సీడ్ ఆయిల్:
క్యారెట్ సీడ్ ఆయిల్ చాలా మంచి యాంటీ ఏజింగ్ ఆయిల్. ఈ నూనెలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. చర్మంపై అకాల ముడతలు , సన్నని గీతలను నివారిస్తుంది. క్యారెట్ సీడ్ ఆయిల్ చర్మాన్ని ఎండ వేడిమి నుండి రక్షించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల మీ చర్మ కణాలు దెబ్బతిన్నట్లయితే.. మీరు క్యారెట్ సీడ్ ఆయిల్ ఉపయోగించి మీ చర్మాన్ని రిపేర్ చేయవచ్చు. క్యారెట్ సీడ్ ఆయిల్ చర్మాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను పెంచడం ద్వారా చర్మాన్ని క్లియర్ చేస్తుంది.
Also Read: మొటిమలు వేధిస్తున్నాయా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి
జోజోబా నూనె:
జోజోబా అనే పండ్ల విత్తనాల నుండి తీసిన నూనె చర్మానికి చాలా మంచిదని చెబుతారు. ఈ నూనెలో విటమిన్ ఇ, రాగి, జింక్, విటమిన్ బి అలాగే అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో ఉండే ట్రాన్స్‌డెర్మల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా ముడతలు తగ్గించే ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.