BigTV English

Elon Musk 13th Child : ఎలన్ మస్క్‌కు రహస్య సంతానం.. తన బిడ్డేనని ప్రకటించిన అమెరికా రచయిత్రి

Elon Musk 13th Child : ఎలన్ మస్క్‌కు రహస్య సంతానం.. తన బిడ్డేనని ప్రకటించిన అమెరికా రచయిత్రి

Elon Musk 13th Child with Ashley Clair| అగ్రరాజ్యం అమెరికాలో దేశాధ్యక్షుడు ట్రంప్‌ను వెనుక నుంచి నడిపిస్తున్న శక్తి ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్.. ట్రంప్ లాగే ఎప్పడూ వివాదాలా చుట్టూనే తిరుగుతుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక యువ రచయిత్రి ఆష్లీ సెయింట్‌ క్లెయిర్ ఒక సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు. తన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.


‘‘ఐదు నెలల క్రితం నేనో బిడ్డకు జన్మనిచ్చాను. నా చిన్నారికి ఎలాన్‌ మస్క్ తండ్రి. మా బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంతకు ముందు ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. కానీ కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయి. అందుకే నేనే ఇప్పుడు వెల్లడిస్తున్నాను. మా సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆష్లీ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తరువాత మరో పోస్ట్ చేసి తాను సోషల్ మీడియా నుంచి కొంతకాలం విరమించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇదే నిజమైతే 53 ఏళ్ల మస్క్.. 31 ఏళ్ల యాష్లేతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లే. ఇప్పటికే ఆయన తన కంపెనీ ఎగ్జిక్యూటివ్‌తో వివాహేతర సంబంధం కలిగిఉన్నారు.


ఎలాన్ మస్క్‌కు 12 మంది సంతానం.. కానీ
ఎలాన్ మస్క్‌కు మొత్తం 12 మంది సంతానం ఉంది. మొదటి భార్య జస్టిన్‌కు జన్మించిన తొలి బిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందింది. తర్వాత ఈ దంపతులు ఐవీఎఫ్ పద్ధతిలో మొత్తం ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 2008లో వారిద్దరూ విడిపోయారు. తర్వాత బ్రిటిష్ నటి తాలులాహ్‌ రిలేను ఈ టెస్లా సీఈఓ వివాహమాడారు. అయితే వారికి సంతానం లేదు. అనంతరం కెనడియన్ గాయని గ్రిమ్స్‌తో సంబంధం నెరిపారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ప్రతిష్ఠాత్మక సంస్థ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్‌ న్యూరాలింక్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌తోనూ మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చినట్లు ఇటీవల మస్క్‌ వెల్లడించారు.

Also Read:  జుకర్ బర్గ్‌కు మరణశిక్ష.. ఆ దేశానికి వెళ్లడానికి భయపడుతున్న మెటా చీఫ్

జేవియర్‌ అలెగ్జాండర్‌ విషయం
ఎలాన్ మస్క్‌ మరియు జస్టిన్‌ దంపతులకు పుట్టిన జేవియర్‌ అలెగ్జాండర్‌ (Xavier Alexander) కొంతకాలం క్రితం అమ్మాయిగా మారారు. తన తండ్రి ఎలాన్ మస్క్‌తో కలిసి జీవించకపోవడంతో పాటు, ఆయనకు దూరంగా ఉండాలని, ఆయనతో పోలీకలు లేకుండా, ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జేవియర్‌ వెల్లడించారు. జేవియర్ తన పేరును జెన్సా విల్సన్‌గా మార్చుకున్నారు. దీనిపై ఓ సందర్భంలో మస్క్‌ స్పందించారు.

‘‘జెన్నాకు కమ్యూనిస్టు భావాలు ఎక్కువ. డబ్బున్న వాళ్లందరూ చెడ్డవాళ్లని భావిస్తుంది. ఆమె అలా మారడానికి తను చదువుకున్న స్కూలే కారణం. తిరిగి ఆమెతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆమె నాతో కాస్త సమయం కూడా గడపడానికి ఇష్టపడటం లేదు ఎందుకో. జెన్నాతో విభేదాలు రావడం చాలా బాధాకరం. నా మొదటి కుమార్తె మరణం కంటే జెన్నాతో విభేదాలే నన్ను ఎక్కువ బాధించాయి’’ అని మస్క్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవలే మస్క్ తన ముగ్గురి పిల్లలను తీసుకొని అమెరికా పర్యటనలో ఉన్న మోదీని కలిశారు.

నా కొడుకు ఎలాన్‌ మంచి తండ్రి కాదు: ఎర్రాల్ మస్క్
ఎలాన్‌ మస్క్‌ తండ్రి ఎర్రాల్ మస్క్‌. ఆయన ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఎలాన్‌ మస్క్‌ మంచి తండ్రి కాదని చెప్పారు. ‘‘ఎలాన్ తొలి సంతానం ఎక్కువ సమయం ఆయాల సంరక్షణలోనే ఉండేవాడు. కొన్ని వారాలకే ఆ బాబు చనిపోయాడు. నా కుమారుడు ప్రపంచ కుబేరుడు. తన ఒక్కో బిడ్డను ఒక్కో ఆయా చూసుకుంటుంది. పిల్లల కోసం మస్క్‌ పెద్దగా సమయం కేటాయించడు’’ అని ఎర్రాల్ మస్క్‌ వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఎర్రాల్ మస్క్ తన రెండో భార్య కుమార్తెతో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అంటే పిల్లలు కనడంలో, వివాహేతర సంబంధాలు కలిగి ఉండడంలో ఎలాన్ మస్క్ తన తండ్రినే ఫాలో అవుతున్నాడు.

 

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×