Pawan Kalyan :సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది తమ హోదాను నిరూపించుకోవడానికి లగ్జరీగా బ్రతుకుతూ ఉంటారు.కానీ మరికొంతమంది వందలు.. కాదు వేలకోట్ల ఆస్తులు ఉన్నా.. చాలా సింపుల్ గా కనిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తర్వాత ప్రథమంగా వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వరుస సినిమాలు చేసి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. ఒకవైపు హీరోగానే కాకుండా మరొకవైపు సమాజ సేవ చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్. అటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. అందులో భాగంగానే తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో కీలకంగా పనిచేసిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత సొంతంగా ‘జనసేన పార్టీ’ని స్థాపించి నిర్విరామంగా కష్టపడ్డారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి, టీడీపీతో పొత్తు పెట్టుకుని.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.
రూ.100 చెప్పులు ధరించి, సింప్లిసిటీ నిరూపించుకున్న పవన్ కళ్యాణ్..
ఇక ప్రస్తుతం డీసీఎం గా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరొకవైపు సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే పలు దేవస్థానాలను తన కొడుకు అకీరానందన్ (Akira Nandan) తో కలిసి సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దేశంలోనే అతి పెద్ద దేవాలయాల్లో ఒకటైన తమిళనాడు తంజావూర్ లోని బృహదీశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన ఆ తర్వాత పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వందలకోట్ల ఆస్తి.. పైగా ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం అలాగే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. కేవలం 100 రూపాయల ప్యారగాన్ చెప్పులు ధరించి కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల ఆస్తి.. పైగా కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇంత ఉన్నా కూడా ఒక సామాన్యుడిలా 100 రూపాయల చెప్పులు ధరించడం ఏంటి? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీకి ఇది చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమాను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వరుస అప్డేట్ వదులుతూ వస్తున్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే సినిమా కంప్లీట్ చేసి మరో మూవీ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకవైపు హీరోగా మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూనే మరొకవైపు సనాతన ధర్మాన్ని కాపాడుతూ తనవంతు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
🙏🏻❤️Man of Simplicity 🧎♂️ pic.twitter.com/YYaGIjJ7yv
— Roopa Pawanism (@GoudRoopa) February 14, 2025