BigTV English
Advertisement

Nellore Chepala pulusu: నెల్లూరు చేపల పులుసు ఇలా చేశారంటే అదిరిపోతుంది, ఒకసారి చేసి చూడండి

Nellore Chepala pulusu: నెల్లూరు చేపల పులుసు ఇలా చేశారంటే అదిరిపోతుంది, ఒకసారి చేసి చూడండి

Nellore Chepala pulusu: నెల్లూరు చేపల పులుసు పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఈ కూర తినేందుకు నెల్లూరు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే నెల్లూరు చేపల పులుసు వండుకోవచ్చు. నెల్లూరు స్టైల్ లో చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకోండి. నిజానికి దీన్ని వండడం పెద్ద కష్టమేమీ కాదు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.


నెల్లూరు చేపల పులుసుకు కావలసిన పదార్థాలు
చేపలు – కేజీ
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
ధనియాల పొడి – ఒక స్పూను
పసుపు – అర స్పూను
కారం – రెండు స్పూన్లు
టమాటోలు – రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
ఉల్లిపాయలు – రెండు
కరివేపాకులు – గుప్పెడు
జీలకర్ర – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
మెంతులు – అర స్పూను
నూనె – సరిపడినంత
ధనియాలు – ఒక స్పూను
పచ్చిమిర్చి – రెండు
చింతపండు – నిమ్మకాయ సైజులో
ఉప్పు – రుచికి సరిపడా

నెల్లూరు చేపల పులుసు రెసిపీ
⦿ చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఒక ప్లేట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలిపి చేప ముక్కలకు పట్టించి పక్కన పెట్టాలి.
⦿ ఇప్పుడు చింతపండును నానబెట్టుకోవాలి.
⦿ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలను సన్నగా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కళాయిని పెట్టి అర స్పూన్ మెంతులు, అర స్పూను జీలకర్ర, రెండు స్పూన్ల ధనియాలు, అర స్పూన్ ఆవాలు వేసి వేయించాలి.
⦿ వాటిని మిక్సీ జార్ లో వేసి పొడి చేయాలి.
⦿ ఇప్పుడు అదే కళాయిలో నూనెని వేయాలి.
⦿ ఆ నూనెలో పావు స్పూన్ మెంతులని వేసి వేయించాలి.
⦿ ఆ తర్వాత పావు స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
⦿ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి.
⦿ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి వేయించుకోవాలి.12. టమాటో ముక్కలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇది మెత్తగా అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇప్పుడు నానబెట్టిన చింతపండును పిండి ఆ నీటిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
⦿ మీకు చేపల పులుసులో ఎంత పులుసు కావాలో అంత నీటిని వేసుకోండి.
⦿ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మరిగించండి.
⦿ ఆ తర్వాత మేరినేట్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేసి పది నిమిషాలు ఉడికించండి.
⦿ ఆ తర్వాత ఒకసారి కళాయిని చేత్తోనే ఇలా కదుపుతూ ముక్కలను కలపండి.
⦿ గరిటెతో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి.
⦿ తర్వాత చిన్న మంట మీద పావుగంటసేపు ఉడికించండి.21. నూనె పైకి తేలే వరకు అలా పులుసును ఉడికించాలి.
⦿ నూనె పైకి తేలాక పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ కట్టేయాలి.23. అంతే టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ అయినట్టే.
⦿ ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇందులో మెంతులను వేసాము. కాబట్టి రుచి భిన్నంగా ఉంటుంది.


Also Read: ఏదైనా కొత్తగా స్వీట్ రెసిపీ తినాలనిపిస్తుందా? టమోటా హల్వా ప్రయత్నించండి

సాధారణ చేపల పులుసుకు, నెల్లూరు చేపల పులుసుకు తేడా ఏంటంటే మెంతులను ముందుగా నూనెలో వేయిస్తాము. అది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అలాగే పచ్చి మామిడికాయను వేసినా కూడా రుచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు పచ్చి మామిడికాయలు దొరకవు. కాబట్టి మేము ఆ పదార్ధాన్ని చెప్పలేదు. మీరు వేసవిలో నెల్లూరు చేపల పులుసు వండుకుంటే అందులో కచ్చితంగా పుల్లని మామిడికాయని వేయండి. చాలా రుచిగా ఉంటుంది, ఎంతో నచ్చుతుంది కూడా. వేడి అన్నంలో చేపల పులుసును చల్లారాక వేసుకొని తినేందుకు ప్రయత్నించండి. చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు పెద్దగా రుచి ఉండదు. చల్లారిన తర్వాతే దానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×