BigTV English
Advertisement

Sticker Vaccine : కొత్త రకమైన స్టిక్కర్ వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్ పూర్తి..

Sticker Vaccine : కొత్త రకమైన స్టిక్కర్ వ్యాక్సిన్.. క్లినికల్ ట్రయల్ పూర్తి..


Sticker Vaccine : ఈరోజుల్లో పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఎన్నో అంతుచిక్కని వ్యాధులు సంభవిస్తున్నాయి. పైగా పెద్దవారికి చికిత్సను అందించినంత సులభంగా పిల్లలకు అందించడం సాధ్యం కాదు. వారి శరీరం ఏ చికిత్సకు ఎలా రియాక్ట్ అవుతుంది, వారికి ఎక్కువ డోస్ డ్రగ్స్ అందించడం మంచిదా కాదా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు అడ్డుగా వస్తాయి. అందుకే పిల్లలకు ఓ వ్యాక్సిన్.. ఒక సులువైన పద్ధతిలో ఇవ్వడాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఇది ఇప్పటికే సక్సెస్ కూడా అవ్వడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మీసెల్స్ రుబెల్లా (ఎమ్మార్) అనే వ్యాక్సిన్ స్టిక్కర్ల రూపంలో ఉండే విధంగా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 9 నెలల లేదా ఆలోపు వయసు ఉన్న పిల్లలకు ఈ పద్ధతిలో వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని వారు నిర్ధారించారు. తాజాగా ఈ వ్యాక్సిన్ మొదటి క్లినికల్ ట్రయల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కూడా అయ్యింది. ఈ వ్యాక్సిన్‌తో పిల్లలకు రక్షణ, ఇమ్యూన్ శక్తి వంటివి కూడా దక్కుతున్నాయని క్లినికల్ ట్రయల్‌లో తేలింది. ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే కాకుండా టీనేజ్‌లో ఉన్నవారికి, యువతకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


గాంబియా ఈ క్లినికల్ ట్రయల్ జరిగింది. 45 మంది యువత, 120 మంది చిన్నపిల్లలు (15 నుండి 18 నెలల వయసులో ఉన్నవారు), 120 మంది పసిపిల్లలు (9 నుండి 10 నెలల వయసు ఉన్నవారు) ఈ క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్నారు. అందరూ ఈ ఎమ్మార్ వ్యాక్సిన్ ఏ నొప్పి లేకుండా ఉందని తెలిపారు. శాస్త్రవేత్తలు కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్‌కు దారితీయకుండా ఉంటుందని, పైగా దీని వల్ల ఎలాంటి ఎలర్జీ సైతం రాదని తేల్చారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇమ్యూన్ శక్తి కూడా పెరిగిందని వైద్యులు చెప్పారు.

ఈ క్లినికల్ ట్రయల్ జరగక ముందే పిల్లల తల్లిదండ్రులు వారి సమ్మతాన్ని తెలిపారు. స్వయంగా వారే దీనికోసం పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇంజెక్షన్ల కంటే ఈ స్టిక్కర్ వ్యాక్సిన్ అనేది పిల్లలకు మంచిదని తల్లిదండ్రులు పూర్తిగా నమ్ముతున్నారు. మొదటి క్లినికల్ ట్రయల్‌లోనే పాజిటివ్‌గా రిజల్ట్ రావడం వారికి ఎంతో సంతోషంగా ఉందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు అన్నింటికి ఈ ఎమ్మార్ వ్యాక్సిన్‌ను అందించడమే వారి లక్ష్యమని బయటపెట్టారు. ఇంజెక్షన్ వల్ల కలిగే నొప్పిని ఈ స్టిక్కర్ వ్యాక్సిన్ ద్వారా తొలగించాలని ఈ టెక్నాలజీని కనిపెట్టినట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారు.

Tags

Related News

Dates Benefits: ఖర్జూరాన్ని ఇలా తీసుకున్నారంటే.. వందల రోగాలు మటుమాయం!

Tea for Kids: పిల్లలకు టీ ఇవ్వడం ప్రమాదకరమా? ఏ వయసు నుంచి టీ ఇవ్వాలి?

Lifestyle Tips: రోజును ఉల్లాసంగా ప్రారంభించడానికి 7 మార్గాలు..

Fat Rich Fruits : ఫ్యాట్ ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Big Stories

×