BigTV English

Tears: ఏడ్చినా కన్నీళ్లు రావడం లేదా? ఎందుకో తెలుసుకోండి

Tears: ఏడ్చినా కన్నీళ్లు రావడం లేదా? ఎందుకో తెలుసుకోండి

Tears: మనలో చాలా మందికి ఎప్పుడైనా ఇలా అనిపించి ఉంటుంది. నం ఎంతో బాధగా, ఉద్వేగంగా ఏడుస్తున్నాం కానీ కన్నీళ్లు మాత్రం రావడం లేదు. అప్పుడు మనలో సందేహం కలుగుతుంది: ‘నిజంగా నేను ఏడుస్తున్నానా?’ లేదా ‘ఇది సాధారణమేనా?’ అనే ప్రశ్నలు. కానీ శాస్త్రజ్ఞులు, వైద్యులు చెబుతున్న మాటేంటంటే.. ఇది సర్వసాధారణమే!


ఎడుపు అనేది మన భావోద్వేగాలకు సహజమైన స్పందన. సంతోషం, బాధ, కోపం, ఒత్తిడి ఇలా ఏవైనా తీవ్రమైన భావాలు మనల్ని ఏడిపిస్తాయి. సాధారణంగా మనం ఏడుస్తే కళ్లలో నుంచి కన్నీళ్లు వస్తాయి. కానీ అందరి శరీర స్పందనలు ఒకేలా ఉండవు. కొంతమందిలో భావాలు ఉన్నా కూడా కన్నీళ్లు రావు. దీనికి కారణాలు వైద్యపరమైనవి, లేదా మానసికపరమైనవో కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

ఏడ్చినా కన్నీళ్లు రాకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో డ్రై ఐ సిండ్రోమ్ ఒకటి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కళ్లలో తేమ లేకపోవడంవల్ల కలిగే సమస్య అని అంటున్నారు. వయసు పెరిగినవారిలో, స్క్రీన్‌లు ఎక్కువగా చూసేవారిలో, కాంటాక్ట్ లెన్సులు వాడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా కంట్లో తేమ తగ్గినప్పుడు, ఏడ్చినా కూడా కన్నీళ్లు రావట.


ఇంకొక కారణం డీహైడ్రేషన్ అయ్యి ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి తగినంత నీళ్లు లేకపోతే కన్నీళ్లు ఉత్పత్తి కావడం కష్టమవుతుంది. ఎక్కువ చెమట, తక్కువగా నీటి సేవనం కూడా దీనికి కారణం కావచ్చట. అలాగే, ఎమోషనల్ ట్రామా లేదా డిప్రెషన్ ఉన్నవారిలో లోపలున్న బాధను బయటపడ్చే శక్తి శరీరానికి ఉండకపోవచ్చు. వాళ్లు లోపల ఎంతో కష్టపడుతున్నా, బయటకు ఒక్క కన్నీళ్లు రాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

అత్యంత అరుదైన సందర్భాల్లో అలాక్రిమియా అనే వ్యాధి వల్ల కూడా కన్నీళ్లు రావు. ఇది చిన్నతనంలోనే కనిపించే వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని సార్లు కుటుంబ పరమైన ఆచారాలు కూడా బాధను బయటకు వ్యక్తపరచకుండా చేయవచ్చు. చిన్నప్పటి నుంచి భావోద్వేగాలపై నియంత్రణ నేర్పిన కుటుంబాల్లో ఎదిగినవారు పెద్దయ్యాక కూడా ఏడుపు వచ్చినా కన్నీళ్లు మాత్రం కనిపించవు.

కన్నీళ్లు రావడం లేదా రాకపోవడం మీద ఆధారపడకుండా, మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. కళ్లు పొడిబారినట్లుగా అనిపిస్తే, తగిన ఐ డ్రాప్స్ వాడడం, నీటిని ఎక్కువగా తాగడం, స్క్రీన్‌లను తక్కువగా ఉపయోగించడం మంచిది. అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించడమూ ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×