Virat Kohli : టీమిండియా (Team India) క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. స్టార్ బ్యాటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి గౌరవ వీడ్కోలు దక్కాల్సిందని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. దాదాపు దశాబ్దంన్నర కాలంగా రోహిత్, కోహ్లీ టీమిండియా కి ఎన్నో విజయాలను అందించారు. వీరిద్దరూ అనూహ్యంగా ఒకేసారి టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 07వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించగా.. కోహ్లీ మే 12న వీడ్కోలు పలికారు. దీంతో క్రీడా లోకం విస్మయానికి గురైంది. మాజీ క్రికెటర్లు కూడా వీరి రిటైర్మెంట్ గురించి తమ స్పందనలను తెలియజేశారు. వాస్తవానికి సచిన్ టెండూర్కర్ తరువాత భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ కి ఉన్నంత క్రికెట్ అభిమానులు మరే క్రికెటర్ కి లేరనే చెప్పాలి. తాజాగా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో 50వేల మంది విరాట్ లు కనిపించారు.
Also Read : IPL 2025 : IPL మ్యాచులు ‘నార్త్’లోనే.. సౌత్ ఇండియాకు నో ఛాన్స్..ఎందుకంటే?
ఇది ఏంటంటే..? AI టెక్నాలజీ ఆధారంగా ఒకేసారి 50 వేల మంది విరాట్ కోహ్లీలు కనిపించారు. ఇందుకు సంబంధించిన పోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్ కి గుడ్ చెప్పేశాడు. ప్రస్తుతం కేవలం వన్డే మ్యాచ్ లకు మాత్రమే పరిమితమయ్యాడు. ధోనీ కూడా గతంలో ఇలాగే వ్యవహరించి కొద్ది రోజుల తరువాత వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఇదిలా ఉంటే.. టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన విరాట్ కోహ్లీ.. రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు నిన్న ప్రకటించేశాడు. ఇక ఇవాళ భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు. యూపీలోని బృంధావన్ ధామ్ కి వెళ్లారు ఈ స్టార్ కపుల్స్. అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు పొందారు. రిటైర్మెంట్ ప్రకటన తరువాత పాల్గొన్న తొలి వ్యక్తి గత కార్యక్రమం కావడంతో అంతా దీని గురించి చర్చించుకోవడం విశేషం.
వాస్తవానికి ఈ ఆధ్యాత్మిక గురువు ఎవరు అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ప్రేమానంద్ మహారజ్.. ధర్మం, భక్తి, ఆధ్యాత్మికత, జీవితం ఇలా క్లిష్టమైన అంశాలను ఎంతో సరళంగా అందరికీ అర్థం అయ్యేవిధంగా చెబుతుంటారు. ఎలా బతకాలి.. ఎలా సమస్యలను అధిగమించాలో.. వివరిస్తుంటారు. భజనలు, ఉపవాసాలతో చాలా మంది భక్తులు ఆయనకు చేరువ అయ్యారు. భక్తి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రేమానంద్ ని కలుస్తుంటారు. గత మూడు, నాలుగేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడిన కోహ్లీ.. పలుమార్లు ఈ గురువును కలిసినట్టు సమాచారం. టీ-20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కంటే ముందు కూడా ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా తన కెరీర్ లో ఎదుర్కొనే ఆటుపోట్లు ఆయనతో పంచుకొని వాటిని పరిష్కరించుకున్నాడు. అందుకే రిటైర్మెంట్ తరువాత కూడా తొలుత ప్రేమానంద్ ను విరాట్ కోహ్లీ కలవడం గమనార్హం. గతంలో కూడా ఈ టీమిండియా కీలక ఆటగాడు పలువారు కలిశాడు. ఇది చాలా రహస్యమైనప్పటికీ ఇప్పుడు గుట్టు రట్టు అయిందనే చెప్పవచ్చు.