BigTV English

Preity Zinta: ప్రీతి జింటాతో మ్యాక్సీ మామ పెళ్లి.. పెంట పెట్టిన నెటిజెన్

Preity Zinta: ప్రీతి జింటాతో మ్యాక్సీ మామ పెళ్లి.. పెంట పెట్టిన నెటిజెన్

Preity Zinta:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో గ్లామర్ షో కూడా విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ కు అందాల తారలు వస్తూ ఉంటారు. మ్యాచ్ షూట్ చేసే.. కెమెరామెన్లు స్టేడియంలో ఎక్కడ అందాల భామలు ఉంటే.. అక్కడ కెమెరాలు పెట్టేస్తారు. ఆ ఫోటో లు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. మిగతా జట్లకు సంబంధించిన మ్యాచ్ లకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ సన్రైజర్స్ హైదరాబాద్ అలాగే పంజాబ్ కింగ్స్ జట్ల తీరు వేరు. ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడాయి అంటే… కెమెరాలు మొత్తం ప్రీతిజింటా అలాగే కావ్య పాప పైన పడతాయి. వాళ్ల ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.


ప్రీతి జింటా కొంపముంచిన నెటిజన్

ఐపీఎల్ 2025 టోర్నమెంటులో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఈసారి కప్ కొట్టేలా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అద్భుతంగా ముందుకు వెళ్తోంది. అయితే…. ఇంత సక్సెస్ గా పంజాబ్ కింగ్స్ నడుస్తున్న నేపథ్యంలో… ఆ జట్టు కో ఓనర్… ప్రీతి జింటాను ఓ నెటిజన్ గెలిచాడు. మాక్సిమామ అలాగే ప్రీతి జింటాకు మధ్య సంబంధం పెట్టేశాడు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా.. అంటూ ప్రీతి జింటాకు కోపం తెప్పించాడు ఓ నెటిజన్.


ప్రీతి జింటాతో మాక్సిమామకు పెళ్లి

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో… సెలబ్రిటీల అందరూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు ఘోర అవమానం ఎదురైంది. అది కూడా సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఇంటరాక్షన్ మొదలుపెట్టారు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా. ఐపీఎల్ 2025 టోర్నమెంటు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో.. అభిమానులను టోర్నమెంట్ వైపు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్…. నటి ప్రీతి జింటాను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు. ఆమెకు అలాగే మ్యాక్సీ మామకు సంబంధం పెట్టే ప్రయత్నం చేశాడు. మ్యాక్సీ మామను మీరు పెళ్లి చేసుకుంటే.. అయిపోవు కదా.. పెద్ద తప్పు చేశారు… మీరు, మ్యాక్సీ మామ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే… అతడు అద్భుతంగా ఆడేవాడు అంటూ సదరు నెటిజన్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశాడు.

అయితే దీనిపై.. వెంటనే హీరోయిన్ ప్రీతి జింటా స్ట్రాంగ్ గా స్పందించారు. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్… నీకు అసలు బుద్ధి ఉందా అన్న రేంజ్ లో రెచ్చిపోయారు ప్రీతి జింటా. నేను ఆడదాన్ని కాబట్టి అలాంటి ప్రశ్న అడిగావు… అదే పంజాబ్ కింగ్స్ ఓనర్ మగవాడైతే.. ఇలా అడిగే వాడివా..? అసలు బుర్ర ఉందా నీకు అని మండిపడ్డారు ప్రీతి జింటా. 18 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పంజాబ్ కింగ్స్ జట్టును నడిపిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటి తన పైన ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం అన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

 

Related News

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

Big Stories

×