BigTV English
Advertisement

Mint Leaves: సువాసనలోనే కాదు.. పుదీనా ఆకులతో ఆ సమస్యలకు చెక్..!

Mint Leaves: సువాసనలోనే కాదు.. పుదీనా ఆకులతో ఆ సమస్యలకు చెక్..!

Mint Leaves: పుదీనా ఆకులు… ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నా, ఆరోగ్యానికి అద్భుతమైన గిఫ్ట్! రుచితో పాటు ఎన్నో ఔషధ గుణాలు నిండిన ఈ ఆకులు మన రోజువారీ జీవితంలో సులభంగా చేర్చుకోవచ్చు. కడుపు సమస్యల నుంచి చర్మ సౌందర్యం వరకూ, పుదీనా ఆకులు ఎలా సాయం చేస్తాయో తెలుసుకుందాం.


కడుపు సమస్యలకు
పుదీనా ఆకుల్లో మెంథాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది కడుపులోని కండరాలను సడలించి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి లాంటి ఇబ్బందులతో బాధపడేవాళ్లు పుదీనా ఆకులు తినో, లేదా పుదీనా టీ తాగితే చాలా రిలీఫ్ కలుగుతుంది. ముఖ్యంగా IBS (ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్) ఉన్నవాళ్లకి పుదీనా ఆకులు కడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా తినేసినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే కడుపు తేలిక అవుతుంది, జీర్ణం సులభంగా జరుగుతుంది.

ఊపిరితిత్తులకు
పుదీనాలోని మెంథాల్ శ్వాసకోశంలో శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తులు, సైనస్‌లను క్లియర్ చేస్తుంది. జలుబు, అలర్జీలు, ఆస్తమా ఉన్నవాళ్లు పుదీనా ఆకుల వాసన పీల్చో, లేదా పుదీనా నీళ్లు తాగితే ఊపిరి సులభంగా తీసుకోవచ్చు. ఫ్లూ సీజన్‌లో లేదా అలర్జీలు ఎక్కువైనప్పుడు పుదీనా సహజ ఔషధంలా వర్క్ చేస్తుంది. పుదీనా ఆకులను వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టినా శ్వాస సమస్యలకు ఊరట కలుగుతుంది.


నోటి ఆరోగ్యానికి
పుదీనా ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి, ఇవి నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించి, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను దూరం చేస్తాయి. తాజా పుదీనా ఆకులు నమిలితే లేదా పుదీనా టూత్‌పేస్ట్ వాడితే నోరు శుభ్రంగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ప్లాక్ తగ్గి, కావిటీస్ వచ్చే చాన్స్ కూడా తగ్గుతుంది. తిన్న తర్వాత రెండు పుదీనా ఆకులు నమిలితే నోరు ఆరోగ్యంగా, రుచిగా ఉంటుంది.

మైండ్ ఫ్రెష్
పుదీనా వాసన మెదడును ఉత్తేజపరిచి, దృష్టిని, జ్ఞాపకశక్తిని బూస్ట్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదువుకునేప్పుడు లేదా ఆఫీస్‌లో స్ట్రెస్‌గా ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చో, లేదా పుదీనా టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అలసట తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే మనసు కూల్ అవుతుంది.

చర్మానికి పుదీనా
పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, చర్మ దురద, చిన్న చిన్న చికాకులను తగ్గిస్తాయి. పుదీనా ఆకుల రసం లేదా పుదీనా ఆయిల్‌ను చర్మంపై రాస్తే ఎరుపు, మొటిమలు తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సన్‌బర్న్ లేదా కీటకాల కాటు వల్ల చర్మం మంటగా ఉన్నప్పుడు పుదీనా రసం రాస్తే చల్లగా, రిలీఫ్‌గా ఉంటుంది. పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే చర్మం అందంగా మెరుస్తుంది.

బరువు తగ్గడంలో
పుదీనా బరువు తగ్గించే మ్యాజిక్ పిల్ కాదు, కానీ జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆకలిని కంట్రోల్ చేస్తుంది. పుదీనా నీళ్లు తాగితే ఎక్కువ తినే అలవాటు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోక్, సోడా లాంటి సుగర్ డ్రింక్స్ బదులు పుదీనా నీళ్లు తాగితే కేలరీలు లేకుండా రుచి జోడించవచ్చు. సలాడ్‌లు, స్మూతీల్లో పుదీనా ఆకులు వేసుకుంటే ఆహారం టేస్టీగా, ఆరోగ్యంగా మారుతుంది.

పుదీనాను ఎలా యూజ్ చేయాలి?
పుదీనా ఆకులను సలాడ్‌లు, స్మూతీలు, నీళ్లలో వేసుకోవచ్చు. పుదీనా టీ, చట్నీలు, సాస్‌లు, డెసర్ట్‌లలో కూడా సులభంగా యూజ్ చేయొచ్చు. పుదీనా ఆకుల రసాన్ని చర్మ సమస్యలకు అప్లై చేయొచ్చు. కానీ, ఎక్కువగా తీసుకుంటే కొందరికి గుండెల్లో మంట రావచ్చు.

Related News

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Pink Salt Benefits: పింక్ సాల్ట్‌ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే మీరూ కొంటారు!

Calcium Rich Foods: ఒంట్లో తగినంత కాల్షియం లేదా ? అయితే ఇవి తినండి !

Big Stories

×