BigTV English
Advertisement

Sree Vishnu: దూసుకెళ్తున్న సింగల్.. ఈ దెబ్బతో విష్ణు సుడి తిరిగినట్టే.. ఖాతాలో మరో మైలురాయి

Sree Vishnu: దూసుకెళ్తున్న సింగల్.. ఈ దెబ్బతో విష్ణు సుడి తిరిగినట్టే.. ఖాతాలో మరో మైలురాయి

Sree Vishnu: టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ స్టార్ శ్రీ విష్ణు హీరోగా, ‘సింగిల్’ మూవీ తో మే 9న ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. రిలీజ్ అయిన ప్రతి చోట భారీ రెస్పాన్స్ తో, పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్స్ తో, దూసుకుపోతోంది. తాజాగా శ్రీ విష్ణు సింగిల్ మూవీ తో మరో ఘనతను అందుకున్నాడు. ఆ వివరాలు చూద్దాం..


హీరో ఖాతాలో మరో మైలురాయి..

తెలుగు రాష్ట్రాల్లో చిన్న సినిమ కథ నచ్చితే, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కామెడీ ఎంటర్టైన్మెంట్, మూవీ సింగిల్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో గీత ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేతికా శర్మ ఇవాన, హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ఇండియాలోనే కాక, అటు అమెరికాలోనూ మూవీ ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ తో, పాటు రికార్డు కలెక్షన్స్ నెలకొల్పుతోంది. ఏడాది సింగిల్ సినిమాతో, ఆడియన్స్ ని పలకరించిన శ్రీ విష్ణు తన ఖాతాలో ఈ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో లో, ఇప్పటికే రెండు లక్షల 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడు అయినట్లు అధికారికంగా ప్రకటించింది. బుక్ మై షో లో టికెట్స్ భారీగా అమ్ముడైన చిన్న సినిమాగా, సింగిల్ మూవీ నిలవనుంది. ఈ ప్రకటనతో శ్రీ విష్ణు తన ఖాతాలో, మరో రికార్డును క్రియేట్ చేశాడంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


ఈ దెబ్బతో విష్ణు సుడి తిరిగినట్టే..

ఇక సింగిల్ మూవీ ఇప్పటికే కలెక్షన్స్ లో, మూత మోగిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే, బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ మూవీని 11 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. అయితే సినిమా రిలీజ్ కి ముందే బడ్జెట్ వసూల్ అవ్వడం విశేషం. ఓటిటి ,శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా ఈ సినిమాకు, దాదాపు 12 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఐదు రోజుల్లోనే, 19 కోట్లకు పైగా వసూలు సాధించింది. సినిమా 5వ రోజు జోరు చూపించి 70 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. అమెరికాలో హాఫ్ మిలియన్ మార్కును అందుకోగా, ఇక వరల్డ్ వైస్ గా 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని,1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

ఇక శ్రీ విష్ణు సామజ వర గమన, ఓం భింభిష్, సినిమాలు మంచి కలెక్షన్స్ ని సాధించాయి. గత సంవత్సరం వచ్చిన స్వాగ్ ఆశించినంత సాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు సింగిల్ మూవీ తో మరో లెవల్ కు చేరుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేయనున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×