బొప్పాయి అంటే పసుపుగా పండిన బొప్పాయినే తినేందుకు ఇష్టపడతారు. ఇది రుచిగా ఉండడమే కాదు. ఎన్నో విటమిన్లను కలిగి ఉంటుంది. అయితే పండిన బొప్పాయినే కాదు పచ్చి బొప్పాయి కూడా తినడం అవసరం. ఎందుకంటే దీనిలో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. పచ్చి బొప్పాయిలు తిరగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగా కలుగుతాయి.
పచ్చి బొప్పాయిలో పోషకాలు నిండుగా ఉంటాయి. ఇది ఆహారంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పేగు చలనశీలతను మెరుగుపరిచి, సంక్లిష్ట ప్రోటీన్ల విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్య, మలబద్దకం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి పచ్చి బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గేందుకు
పచ్చి బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి పచ్చి బొప్పాయి తినడం వల్ల బరువు తగ్గడం సులువుగా మారుతుంది. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. కాబట్టి మీరు అనవసరమైన ఆహారాన్ని తినరు. ఆకలి కూడా ఎక్కువగా లేదు. జీవక్రియలో ఆహారం విచ్ఛిన్నం వంటి పనులను సవ్యంగా సాగేలా చేస్తుంది.
గుండెపోటును అడ్డుకుంటుంది
యాంటీ ఆక్సిడెంట్లు పచ్చి బొప్పాయిలు అధికంగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్ కూడా నిండుగా ఉంటాయి. పచ్చి బొప్పాయి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల గుండెపోటు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు .దీంట్లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. గుండె జబ్బులకు ప్రధాన కారకమైన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో పచ్చి బొప్పాయి ఎంతో సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయితో వెరైటీలు..
Also Read: టీతో పాటు వీటిని తింటే.. విషంతో సమానం తెలుసా ?
పచ్చిబొప్పాయిని తినడం వల్ల శరీరం నుంచి విషాలు బయటికి పోతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను కాపాడతాయి. పచ్చిబొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్లు మనకు అత్యవసరమైనవి. చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి బొప్పాయి అత్యవసరమైనది. చర్మాన్ని మెరిపించడంలో కూడా పచ్చి బొప్పాయి ముందుంటుంది. పచ్చిబొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.