BigTV English

OTT Movie : అమ్మాయిల్ని అమాంతంగా మింగేసే వింత మనిషి… వీడి నోరేంట్రా బాబోయ్ ఇంతుంది

OTT Movie : అమ్మాయిల్ని అమాంతంగా మింగేసే వింత మనిషి… వీడి నోరేంట్రా బాబోయ్ ఇంతుంది

OTT Movie : ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి ఒక వేదిక గా మారింది. ఇందులో అన్నిరకాల జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. అయితే వీటిలో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ సినిమాలను చాలా మంది ఒంటరిగా మాత్రం చూడలేరు. ఎవరైనా తోడు ఉంటే తప్ప ఈ సినిమాల జోలికి వెళ్లరు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కాస్తంత కామెడీ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా అందరూ చూసే విధంగానే ఉంటుంది. మీరు కూడా ఈ మూవీ పై ఓ లుక్ వేయండి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ హారర్ కామెడీ మూవీ పేరు ‘చాంపీ & ది గర్ల్స్’ (Chompy & the Girls). 2021 లో విడుదలైన ఈ మూవీకి స్కై బ్రాబాండ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఒక వైపు వినోదాన్ని, మరోవైపు భయానకమైన వాతావరణాన్ని ఇస్తుంది. ఈ స్టోరీ కుటుంబ సంబంధాలు, ఒంటరితనం, అసాధారణ జీవుల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జాక్సన్ అనే యువతి ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కుంటుంది. ఆమె జీవితం నిరాశలో మునిగి ఉంటుంది. అందువల్ల ఆమె ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ విధి ఆమెను కాపాడుతుంది. ఈ సంఘటన తర్వాత, ఆమె తన తండ్రి సామ్ ని కలవాలని నిర్ణయించుకుంటుంది. అతనికి ఆమె ఏం చేస్తోందో కూడా అతనికి తెలియదు. సామ్ కూడా తన భార్యతో మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటాడు. జాక్సన్‌తో ఇంట్లో కలవడానికి భయపడి, ఒక పార్కులో కలుస్తాడు. అయితే, వారి మొదటి సమావేశం సాధారణంగా సాగకుండా, వింతైన మలుపు తిరుగుతుంది. వారు పార్కులో ఉన్నప్పుడు, చాంపీ అనే ఒక వ్యక్తి తన నోటిని నాలుగు అడుగుల వెడల్పుగా తెరిచి, ఒక చిన్న అమ్మాయిని అమాంతం మింగడం చూస్తారు. ఈ భయానక సంఘటన వారిని షాక్‌లోకి నెట్టివేస్తుంది. ఆ వ్యక్తి జాక్సన్, సామ్ లను కూడా వెంబడిస్తాడు. ఈ సంఘటన తర్వాత, జాక్సన్, సామ్ చాంపీ గురించి తెలుసుకోవడానికి, అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు.

జాక్సన్ తన స్నేహితుడు పారానార్మల్ ఆక్టివిటీస్ తెలిసిన లోటస్ సహాయం తీసుకుంటుంది. వాళ్ళు చాంపీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అతను ఒక అసాధారణ జీవి అని, అతనిలో ఉన్న మరో రూపం అలా చెపిస్తుందని తెలుసుకుంటారు. చాంపీ నిజంగా శత్రువు కాదని, బిర్చ్‌లోని చెడు శక్తే అసలైన ప్రమాదమని వెల్లడవుతుంది. జాక్సన్, సామ్ ఈ అతీంద్రియ శక్తిని ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తారు. ఈ క్రమంలో వారు చాంపీ కడుపులో చిక్కుకుంటారు. చివరికి వాళ్ళు చాంపీలో ఉన్న బిర్చ్‌ను వెల్లగొడతారా ? జాక్సన్, సామ్ కలసి జీవిస్తారా ? సామ్ కి భార్యతో కష్టాలు తీరుతాయా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : పిల్లలు పుట్టట్లేదని దెయ్యంతో పాడు పని… ఈ రియల్ హర్రర్ మూవీని సింగిల్ గా చూసే దమ్ముందా?

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×