Tea: చాలా మంది టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటు ఎక్కువ మందిలో ఉంటుంది. ఇదిలా ఉంటే సాయంత్రం టీ తాగే వారు కొన్ని రకాల స్నాక్స్
కూడా ఇదే సమయంలో తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక నష్టాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం కంటే టీ తాగేటప్పడు స్నాక్స్ తినడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. టీతో ఎప్పుడూ తినకూడని పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్ అధికంగా ఉండే ఆహారం:
ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను టీతో పాటు అస్సలు తినకూడదు. ఆకుపచ్చ కూరగాయలు, రోటీ, శాండ్‌విచ్‌లు, పరాఠాలు మొదలైనవి తినకుండా ఉండటం మంచిది. కానీ, దీని తర్వాత టీ తాగడం మానుకోవాలి. నిజానికి.. టీలో టానిన్ ఉంటుంది. ఇది ఇనుము వంటి పోషకాలను నాశనం చేస్తుంది. అంతే కాకుండా డ్రై ఫ్రూట్స్ లేదా ఉప్పగా ఉండే స్నాక్స్‌ను టీతో పాటు తినకూడదు ఎందుకంటే వాటిలో కూడా ఐరన్ ఉంటుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలు:
టీతో పకోడాలు, ఆలూ బోండా, సమోసాలు వంటివి చాలా మంది తినడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, శనగ పిండితో చేసిన ఈ స్నాక్స్ తిన్న తర్వాత టీ తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అంతే కాకుండా అనేక కడుపు సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.
నిమ్మకాయ, పుల్లని పదార్థాలు:
ఈ రోజుల్లో బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి చాలా మంది నిమ్మకాయ టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. కానీ.. ఈ టీ మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిమ్మకాయ , ఇతర సిట్రస్ పండ్లు తిన్న తర్వాత టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడి, గుండెల్లో మంట, వాపు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని తినడం వల్ల టీలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ కాటెచిన్‌ను శరీరం గ్రహించడం కష్టమవుతుంది.
తీపి పదార్థాలు:
టీతో పాటు బిస్కెట్లు, కేక్, చాక్లెట్ వంటి తీపి పదార్థాలను తినకూడదు. వీటిని టీతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇవి శక్తి స్థాయిలను తగ్గించడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. తియ్యటి పదార్థాలు ఉన్న స్నాక్స్ తినడం వల్ల డయాబెటిస్ రావచ్చు.
Also Read: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? పొరపాటున కూడా అలా చేయొద్దు !
గుడ్లు:
ఎగ్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను టీతో కలిపి తినడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఆమ్లెట్ తిన్న తర్వాత టీ తాగినా, ఉడికించిన గుడ్డు తిన్నా కూడా అనేక సమస్యలు వస్తాయి.
చల్లటి నీరు:
టీ తాగే ముందు నీళ్లు తాగొచ్చు. కానీ.. పొరపాటున కూడా టీతో పాటు లేదా తర్వాత చల్లటి నీరు తాగకూడదు. టీ తాగిన తర్వాత జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ లేదా ఇతర చల్లని పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఇది తీవ్రమైన అసిడిటీ సమస్యను కూడా కలిగిస్తుంది.