E-Paper
Advertisement

చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్

చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్
Advertisement

Numerology Sensitive Birth Numbers| న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని మూల అంకాలు కలిగిన వ్యక్తులు ఎక్కువ సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా భావోద్వేగాలకు లోనవుతారు. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని చెబుతారు. కొన్నిసార్లు సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే, జరిగిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటారు. మరి భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతారని చెప్పే మూల అంకాలు ఏవో తెలుసుకుందాం.

మూల అంకం 2 ఉన్నవారిది సున్నితమైన మనస్తత్వం

ఏ నెలలోనైనా 2, 11, 20 లేదా 29వ తేదీన పుట్టినవారి మూల అంకం 2 అవుతుంది. న్యూమరాలజీలో మూల అంకం 2కు చంద్రుడిని అధిపతిగా పరిగణిస్తారు. చంద్రుడు భావోద్వేగాలు, మనసు, సున్నితత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే మూల అంకం 2 ఉన్నవారు మృదువైన మనస్తత్వం కలిగి ఉంటారని నమ్మకం ఉంది.

మూల అంకం 2.. చిన్న విషయాలకు కూడా బాధపడతారు

Advertisement

మూల అంకం 2 ఉన్నవారు తమకు నచ్చినట్లు జరగకపోతే త్వరగా నిరాశ చెందవచ్చు. ఎవరైనా కాస్త కఠినంగా మాట్లాడితే, ఆ మాటలను వారు ఎక్కువగా మనసుకు తీసుకోవచ్చు. తమ సమస్యలను పదేపదే కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో చెప్పుకునే అవకాశం ఉంటుంది. దీంతో కొన్నిసార్లు వారి దృష్టి సమస్యలపైనే ఎక్కువగా నిలిచిపోతుంది. ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ మూల అంకం ఉన్న వ్యక్తులలో కొందరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారు సమస్యలను పరిష్కరించడానికి బదులుగా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనా విధానం నిరాశ నుంచి బయటపడటాన్ని ఆలస్యం చేయవచ్చు.

మూల అంకం 7.. లోతుగా ఆలోచించే స్వభావం

ఏ నెలలోనైనా 7, 16 లేదా 25వ తేదీన పుట్టినవారి మూల అంకం 7 అవుతుంది. న్యూమరాలజీలో మూల అంకం 7కి కేతువు అధిపతి. ఈ మూల అంకం ఉన్నవారు లోతుగా ఆలోచించే వ్యక్తులుగా పరిగణించబడతారు. అయితే ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి.

మూల అంకం 7 ఉన్నవారు తమ భావాలను బయటపెట్టడంలో ఇబ్బందిపడతారు

Advertisement

మూల అంకం 7 ఉన్నవారు తమ భావాలను ప్రతి ఒక్కరితో సులభంగా చెప్పరు. తమను ఇతరులు అర్థం చేసుకోవడం లేదనే భావన వారికి కలగవచ్చు. ఈ ఆలోచన వారిలో ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు పెంచే పెంచే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటనలను పదేపదే గుర్తుచేసుకుంటూ బాధపడే అవకాశం కూడా ఉంటుంది.

మూల అంకాలు 4, 8 కూడా నిరాశకు లోనవుతారు

న్యూమరాలజీ ప్రకారం.. మూల అంకాలు 4, 8 ఉన్నవారిలో కూడా త్వరగా నిరాశ చెందే స్వభావం ఉంటుంది. అయితే వారు తమ అసంతృప్తిని కోపం లేదా ఆచరణాత్మక సమస్యల రూపంలో వ్యక్తం చేస్తారు.

మూల అంకాలు 2, 7 ఉన్నవారు మాత్రం భావోద్వేగంగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది.

Also Read: చదువు, క్రమశిక్షణ, ప్రవర్తనలో నెంబర్ 1.. పిల్లల్ని ప్రయోజకులుగా పెంచే జపాన్ పేరెంటింగ్ టిప్స్

సానుకూలంగా ఉండేందుకు ఈ మార్పులు

ఈ లక్షణాలు తమలో ఉన్నాయని భావించే వారు ప్రతికూల ఆలోచనలను తగ్గించేందుకు ప్రయత్నించాలి. ధ్యానం, యోగా, విశ్రాంతి పద్ధతులు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతి మాటను వ్యక్తిగతంగా తీసుకోకుండా పరిస్థితిని ఆచరణాత్మకంగా చూడటం మంచిది. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడపడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సమస్యలను పదేపదే ఆలోచించడం కంటే వాటికి పరిష్కారాలను వెతకడంపై దృష్టి పెట్టాలి.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. న్యూమరాలజీ అనేది నమ్మకాలు సంప్రదాయాలపై ఆధారపడిన విధానం.

Also Read: తప్పు చేసినా అంగీకరించరు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఈగో, మొండితనం ఎక్కువ

Related News

డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? హోంమేడ్ అండర్ ఐ జెల్ ఇలా తయారు చేసుకోండి

పిల్లల్లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం? తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పులే కారణం

మాటల వరకే ప్రేమ, అవసరమైనప్పుడు దూరం.. సీగలింగ్ డేటింగ్‌తో జాగ్రత్త

మీ సోదరి రాఖీ గిఫ్ట్ ఇచ్చే ముందు ఇది తెలుసుకోండి.. రాశి ప్రకారం వారికి నచ్చే వస్తువులు ఇవే

రాఖీ కేవలం అన్నాచెల్లెళ్ల పండగేనా? అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

మీరు కూడా మీ ఆఫీస్ బాస్‌ని తిట్టుకుంటూ ఉంటారా? దానివల్ల కలిగే ప్రభావం ఇదే

వయసు పెరిగినా తరగని గ్లో..మాస్ మహారాజా తాగే ఆ మ్యాజికల్ డ్రింక్ ఇదే!

Big Stories

Advertisement
×