Irumudi Movie : ఈమధ్య సినిమాలలో మెసేజ్లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు ఇచ్చిన మెసేజ్ సమాజానికి ఉపయోగపడితే.. మరికొన్ని సినిమాలు మాత్రం మెసేజ్ ఇచ్చిన సరే వృధా ప్రయత్నం గాని మారిపోతుంది. ఏది ఏమైనా కూడా డైరెక్టర్ చేసిన చిన్న ప్రయత్నం మాత్రం కొన్నిసార్లు సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఇరుముడి చిత్రంలో డైరెక్టర్ చేసిన ప్రయత్నం జనాలకు బాగా నచ్చిందనే చెప్పాలి. అమ్మాయిలు సమాజంలో ఎలా ఉండాలి..? అమ్మాయిలకు పరావర్తన ఎలా ఉండాలి? ఏదైనా సమస్య వస్తే వాళ్లని వాళ్లు ఎలా కాపాడుకుంటారు అన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు. అయితే మొదట బాగానే ఉన్నాయి సినిమా చివరి వరకు పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా ప్రయత్నం వృధా అయిందా? జనంలో సినిమా గురించి ఇప్పటికీ ఎలాంటి టాక్ వినిపిస్తుంది..? అన్నది వివరంగా తెలుసుకుందాం..
ఒక కథను వెండితెరపై చూపించేటప్పుడు దర్శకుడికి సామాజిక బాధ్యత ఉండాలి. కానీ ఈ సినిమాలో చెప్పాలనుకున్న సందేశానికి, చూపించిన ముగింపునకు అసలు పొంతనే లేకుండా పోయింది.
సినిమా మొదట్లో ఆడపిల్ల భయపడకూడదు, సమాజంలో ఎలాంటి వేధింపులు ఎదురైనా ఇంట్లో తండ్రికి చెప్పేంత ధైర్యం ఉండాలి అని గొప్ప ఆదర్శాన్ని నూరిపోశారు. కానీ చివరికి ఏం చేశారు? తండ్రిని నమ్మి నిజం చెప్పాలనుకున్న ఆ ధైర్యవంతురాలైన ఆడపిల్లనే దారుణంగా చంపేశారు.
మరోవైపు, “ఆడపిల్లకు భయమే శ్రీరామరక్ష” అంటూ బతికే పాత్రలోని అమ్మాయి… భయపడి నిజం దాచిపెట్టి, ఒక దుర్మార్గుడి చేతిలో తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. ధైర్యంగా నిజం చెప్పాలనుకున్న ఆడపిల్ల సమాధి అయ్యింది.
నిజానికి భయంతో నిజం దాచిన ఆడపిల్ల జీవితం నాశనమైంది. అసలు ఈ కథ ద్వారా డైరెక్టర్ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజం మాట్లాడినా చావే, భయపడి దాచినా చావే అని చూపిస్తే రేపు నిజ జీవితంలో ఏ ఆడపిల్ల అయినా తన కష్టాన్ని తల్లిదండ్రులతో పంచుకోవడానికి ధైర్యం చేస్తుందా? “బయటకు చెబితే నన్ను కూడా ఇలాగే చంపేస్తారేమో” అన్న అభద్రతా భావం వారిలో నాటుకుపోదా?ఆ పోరాడే పాత్ర బతికి, దుర్మార్గుడికి శిక్ష పడేలా చేసి ఉంటే ఎంతోమంది ఆడపిల్లలకు, తల్లిదండ్రులకు కొండంత మనోధైర్యం దక్కేది. ‘సినిమాను సినిమాగానే చూడాలి’ అని కొట్టిపారేయలేం. కథలు సమాజపు ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. సమాజానికి ఆదర్శం కావాల్సిన కథలో, చివరకు నిస్సహాయతనే మిగిల్చడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది..
ప్రస్తుతం రవితేజ నటించిన ఇరుముడి సినిమా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ మూవీ స్టోరీ దాదాపు అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. సమాజంలో జరుగుతున్న అమ్మాయిలపై అఘాత్యాలను ఎదుర్కోవడం ఎలా? ఒంటరిగా వెళ్లే అమ్మాయిలు తమ రక్షణ కోసం ఏం చేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని అందుకోవాలి. ఆకతాయిలను లేదా కిడ్నాపర్లను ఎలా ఎదుర్కోవాలి అని చిన్నచిన్న అంశాలను కొంచెం ఎక్కువగా చూపించింటే బాగుండేది అని కొందరు జనాలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో చక్కటి మెసేజ్ అయితే ఉంది. ఒక వర్గం ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. నెక్స్ట్ టైం ఇలాంటి స్టోరీ తో వచ్చే సినిమాలకు ఇది మూల పాయింట్ గా నిలిచే అవకాశం కూడా ఉంది.. మరి రవితేజ ఇలాంటి స్టోరీ తోనే మళ్లీ ఇంకో సినిమా చేస్తాడా అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో సస్పెన్స్ గా మారింది.. ఈ సినిమాకు ఒకవైపు విమర్శలు ఎదురవుతున్న సరే మరోవైపు మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది..
Also Read :Podarillu Today Episode : చక్రీ పై మహా సీరియస్.. మాధవ్ కీలక నిర్ణయం..? కన్నాకు జోడీ దొరికేసిందోచ్..