BigTV English
Advertisement

Mokshagna Tej : మోక్షజ్ఞ జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..నిజంగానే అది జరగదా..?

Mokshagna Tej : మోక్షజ్ఞ జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..నిజంగానే అది జరగదా..?

Mokshagna Tej : టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ కుటుంబం నుంచి తారక రామారావు తర్వాత రెండు తరాల హీరోలు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మూడవ తరం కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి బాలయ్య, నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మూడో తరం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న హీరోలలో నందమూరి బాలయ్య ముద్దుల కొడుకు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ బయటకు వచ్చింది. హీరోగా ఎంట్రీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల అతని ఎంట్రీ ఆలస్యం అవుతుంది.. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు బాలయ్య అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.


మోక్షజ్ఞ జాతకం చెప్పిన వేణుస్వామి..

ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. సినీ హీరో, హీరోయిన్ల తో పూజలు చేయించడమే కాకుండా.. ఇంటర్వ్యూలలో హీరోలు,  హీరోయిన్లపై సంచలన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖుల జాతకాలు ఇవే అంటూ చెప్పి పలు వివాదాలను కోరి తెచ్చుకున్నారు. కొన్ని సార్లు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యారు. ఒకవైపు వివాదాలు వెంటాడుతున్న కూడా సెలబ్రిటీల జాతకాలు చెప్పడం ఆపలేదు. తాజాగా ఈయన నందమూరి హీరో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ప్రశ్నలు ఎదురయ్యాయి..


వేణు స్వామి మాట్లాడుతూ.. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ చాలా లేటుగా ఉంటుంది కావచ్చు అని, ఆయన ఇండస్ట్రీకి రావడం పక్కా. ఆయన కూడా నందమూరి హీరోలలో ఒకరిగా సక్సెస్ అవుతారు. అయితే ఈ కుటుంబంలో కేవలం సినీ ఇండస్ట్రీ కాకుండా రాజకీయం కూడా ఉంది.. అయితే సినిమాల్లో సక్సెస్ అవుతాడు కానీ.. రాజకీయాల్లో మాత్రం అది జరగనే జరగదు అంటూ తేల్చి చెప్పేశారు. సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా పెద్ద స్టార్ అయిపోతారు. కాస్త ఆలస్యం కావచ్చు.. కానీ తన తండ్రిలాగే మంచి స్టార్‌డమ్‌ సంపాదించుకుంటారు.. రాజకీయాల జోలికి వెళ్తే కెరీర్ క్లోజ్ అవుతుందని బాంబ్ పేల్చారు.. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఆ ఇంటర్వ్యూ వీడియోని చూసిన నందమూరి అభిమానులు వేణు స్వామి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది..

Also Read : వాటికి ఒప్పుకుంటేనే కెరీర్.. ఆ ఒక్కటే బాధగా ఉంది..?

మోక్షజ్ఞ, క్రిష్ కాంబోలో మూవీ.. 

నందమూరి వారసుడు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ్ ను ముందుగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవ్వడంతో ఈ సినిమా నుంచి ప్రశాంత వర్మ తప్పుకున్నాడు.. ఇప్పుడు క్రిష్ మోక్షజ్ఞని లాంచ్ చెయ్యబోతున్నారంటు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల బాలయ్యకు స్టోరీ కూడా వినిపించినట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×