White Hair Tips: ప్రస్తుతం కాలంలో తెల్లజుట్టు అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఒత్తిడి, బయట కాలుష్యం, దుమ్మూ మొదలైనవి. అయితే తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే మనం వారంలో రెండు, మూడు సార్లు అయిన ఆయిల్ పెడుతున్నామా? కెమికల్స్ షాంపులు వాడకుండా ఉంటున్నామా? ఇంకా మంచి న్యూట్రీషనల్ ఫుడ్ తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలి. ఎందుకంటే న్యూట్రీషన్స్ డెఫిసియన్సి ఉన్నా కూడా.. అంటే విటమిన్ బి12, ఐరన్, జింక్, కాపర్, విటమిన్ ఇ వంటి డెఫిసియన్సి లోపం ఉన్న తెల్ల జుట్టు వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆల్రెడీ తెల్లజుట్టు వచ్చిన వారు కవర్ చేయాలంటే.. హెయిర్ డైలు వేస్తే మళ్లీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి నాచురల్‌గా హెయిర్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మంచి రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. మరి ఇంట్లోనే నాచురల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ తొక్కలు, బాదం, మెంతులతో హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని.. అందులో ఉల్లిపాయ తొక్కలు, బాదం ఐదు, మెంతులు, కరివేపాకు వేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి తయారు చేసుకున్న పదార్ధాలన్నిటిని.. మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో ఆవాల నూనె కలిపి తలకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటివల్ల ఎలాంటి హాని కలగదు. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.
ఆవాలు, మెంతులు, కలోంజీ సీడ్స్‌తో హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి పాన్ పెట్టుకుని.. అందులో ఆవాలు, మెంతులు, కళోంజీ సీడ్స్ వేసి బాగా నల్లగా మారేంత వరకు వేయించాలి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి తలకు అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు తలకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే శాశ్వతంగా తెల్లజుట్టు మాయం అవుతుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.
టీపొడి, గోరింటాకు పొడితో హెయిర్ మాస్క్
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ టీ పొడి, గ్లాసు వాటర్, మెంతులు, కరివేపాకు వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకుని అందులో గోరింటాకు పొడి కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తలకు పట్టించి.. కనీసం అరగంట పాటు ఉంచి తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు పెడితే సరిపోతుంది. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.