Orange Peel Benefits: నారింజ తొక్కలను పనికిరానివిగా భావించి పారేస్తారు. కానీ ఈ తొక్కలు చర్మ సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తాయి. నారింజ తొక్కలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, మచ్చలను తేలిక పరచడానికి, చర్మ కాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడతాయి. మీరు కూడా మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలనుకుంటే ఇంట్లో తయారుచేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడండి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ తొక్కలతో ఫేస్ సీరం:
నారింజ తొక్క – 1 నారింజ తొక్క
నిమ్మరసం – 1 టీస్పూన్
రోజ్ వాటర్ – 2-3 టీస్పూన్లు
కొబ్బరి నూనె – 1 టీస్పూన్
తేనె – 1/2 టీస్పూన్
ఫేస్ సీరం:
ముందుగా నారింజ తొక్కలను బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. వీటిని ఎండలో ఆరబెట్టండి. ఆరిన తర్వాత, ఈ తొక్కలను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని, పౌడర్‌గా తయారు చేసుకోండి. ఇప్పుడు నారింజ తొక్క పొడి సిద్ధంగా ఉంది.
సీరం సిద్ధం చేయండి:
ఒక చిన్న గిన్నెలో నారింజ తొక్కల పొడి (1-2 టీస్పూన్లు) వేసి..పైన తెలిపిన మోతాదులో నిమ్మరసం, రోజ్ వాటర్, కొబ్బరి నూనె , తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమం సహజమైన ఫేస్ సీరం లాగా తయారవుతుంది.
సీరం వాడకం :
ఈ ఫేస్ సీరమ్‌ను మీ ముఖంపై అప్లై చేయండి. ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాతే సీరం అప్లై చేయాలని గుర్తుంచుకోండి. సీరంను ముఖంపై 15-20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. మీరు దీన్ని రోజుకు 1-2 సార్లు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట దీన్ని ఉపయోగించడం వల్ల చర్మానికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
కాంతివంతమైన చర్మం:
నారింజ తొక్కల్లో ఉండే విటమిన్ సి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా , ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది.
మరకలను వదిలించుకోండి:
ఈ సీరం మచ్చలను తేలిక పరచడానికి , చర్మాన్ని సమం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.
Also Read: ఈ హెయిర్ మాస్క్ ఒక్కసారి వాడినా చాలు.. జుట్టు పెరగడం గ్యారంటీ
యాంటీ ఆక్సిడెంట్లు:
నారింజ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని బాహ్య ప్రభావాల నుండి రక్షిస్తాయి . అంతే కాకుండా వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తాయి.
మృదువైన చర్మం:
తేనె , కొబ్బరి నూనె, ఆరెంజ్ సీరం కలిపి వాడితే ఇవి మీ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. తరచుగా వీటిని వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. చర్మం అందంగా మెరుస్తూ ఉండాలంటే తేనెను వాడటం ముఖ్యం. అంతే కాకుండా ఆరెంజ్ సీరంలో ఉండే లక్షణాలు గ్లోయింగ్ స్కిన్ ను మీకు అందిస్తాయి. తరచుగా దీనిని వాడటం వల్ల మచ్చ లేని చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమల సమస్య ఉన్న వారు కూడా దీనిని వాడటం వల్ల అద్భుతమైన లాభాలు కూడా ఉంటాయి.