Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఏం గా భాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాలు అటు అసెంబ్లీ సమావేశాలు అంటూ బిజీగా ఉన్నారు. ఆయన నోట సినిమాల మాట రాలేదు. రాజకీయాల్లో కాస్త గ్యాప్ దొరికితే దేవాలయాలు తిరుగుతున్నాడు. కానీ గతంలో కమిట్ అయిన చిత్రాలకు డేట్స్ మాత్రం ఇవ్వలేదు.. అయితే ఇటీవల ఓజీ దర్శకుడు సుజిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అది నిజమే అయినప్పటికీ పవన్ మౌనంగా ఉన్నారు.. తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ లుక్ తో కనిపించాడు. ఆ లుక్ ఓజీ కోసమేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ లుక్ ఎందుకోసమో ఇప్పుడు తెలుసుకుందాం..
పవర్ గతంలో వరుసగా మూడు సినిమాలను ప్రకటించాడు.. అందులో ఒక్క సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ వరకు చేశాడు. మిగిలిన సినిమాలకు సగం వరకు పూర్తి చేసినట్లు తెలుస్తుంది.. అయితే ఈ సినిమాలు ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా పవన్ న్యూ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం పవన్ ఇంకా కాషాయం ధరించే ఉన్నారు. మాలా ధారణలో భాగంగా ఉన్నారు. ఈ క్రమంలో పవన్ గెడ్డం ట్రిమ్ చేసారు. అంతేకాదు ఆయన లుక్ పరంగా కొన్ని మార్పులు వచ్చాయి. ఈ లుక్ ఫోటోలు కాస్త వైరల్ అవ్వడంతో మళ్లీ సినిమాల్లో బిజీగా ఉన్నాడా? అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా కూడా న్యూ లుక్ మాత్రం అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : తెలుగులో ‘ఛావా’కు రికార్డ్ ఓపెనింగ్స్..ఎన్ని కోట్లంటే..?
గడ్డం మాత్రం మొన్న కుంభమేళాకు వెళ్ళినప్పటికి ఇప్పటికి స్లిమ్ అయ్యాడని తెలుస్తుంది. కళ్లలో తేజస్సు ఉట్టిపడుతుంది. హెయిర్ మాత్రం యధావిధి గానే ఉంది. హెయిర్ పరంగా ఎలాంటి మార్పులు కనిపించలేదు. మరి ఈ న్యులుక్ దేనికోసం అంటే? తిరిగి మళ్లీ షూటింగ్ ల కోసమేనని తెలుస్తోంది.. ఈ న్యూ లుక్ మాత్రం ఓజీ కోసమా? లేదా హరిహర వీరమల్ల కోసమా అన్నది తెలియలేదు? ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లుక్కు మార్చారంటే కచ్చితంగా సినిమాలు పూర్తి చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లులో యోదుడి పాత్ర పోషిస్తున్నాడు. ‘ఓజీ’లో గ్యాంగ్ స్టర్ పాత్రకి లైట్ గా గెడ్డం ఉంది. వీరమల్లులో మాత్రం కొన్ని లుక్స్ లో క్లీన్ షేవ్లో… మరికొన్నింటిలో లైట్ గా గెడ్డం కనిపిస్తుంది. మరి ఇప్పుడు తాజా లుక్ రెండు సినిమాల కోసమా? లేక వీరమల్లు కోసం స్పెషల్ గా ట్రిమ్ చేయించాడా? అన్నది తెలియాల్సి ఉంది. వీరమల్లు కోసం పవన్ నాలుగు రోజలు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్ అంతా పూర్తయింది. కేవలం పవన్ నాలుగు రోజులు ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది.. ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఆల్రెడీ మేకర్స్అ నౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. ఈనెల 28న సినిమా రిలీజ్ అయిపోతుంది అని పవన్ ఫ్యాన్స్ అటు మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు ఇస్తాడా లేదా చూడాలి..