Homemade Toner: చర్మ సంరక్షణలో క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది ‘టోనింగ్’ అంతగా పట్టించుకోరు. కానీ టోనర్ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడటమే కాకుండా .. ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
చర్మం అందంగా ఉండాలంటే టోనర్ చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉంచడమే కాకుండా, ఆరోగ్యంగా , యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో అనేక రకాల టోనర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంట్లో తయారుచేసిన టోనర్లు వాడటం మంచిది. వీటిలో ఎలాంటి రసాయనాలు వాడము కాబట్టి చర్మానికి సురక్షితమైనవి. మరి చర్మానికి మేలు చేసే టోనర్ లను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి. వాటి ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టోనర్ అంటే ఏమిటి ? ఇది ఎందుకు ముఖ్యమైనది ?
చర్మాన్ని శుభ్రపరచడానికి.. pH స్థాయిని సమతుల్యం చేయడానికి, చర్మాన్ని తేమగా ఉంచడానికి టోనర్ ఉపయోగించబడుతుంది. ఇది ముఖాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది . అంతే కాకుండా రోజంతా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇంట్లో తయారుచేసిన టోనర్‌లో సహజ పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా పోషించడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.
టోనర్ యొక్క ప్రయోజనాలు:
⦿ రసాయన రహితం, సురక్షితం:
మార్కెట్లో లభించే టోనర్లలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఇంట్లో తయారుచేసిన టోనర్లు పూర్తిగా సహజమైనవి. ఇది చర్మానికి సురక్షితమైనవి, ప్రయోజనకరమైనవి.
⦿ చర్మానికి పోషణ:
ఇంట్లో తయారుచేసిన టోనర్లలో ఉపయోగించే రోజ్ వాటర్, కలబంద, దోసకాయ లేదా గ్రీన్ టీ వంటి పదార్థాలు చర్మానికి అవసరమైన పోషణ, తేమను అందిస్తాయి. అంతే కాకుండా ఇవి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తాయి.
⦿ చర్మం pH స్థాయి:
చర్మ ఆరోగ్యానికి సరైన pH స్థాయి చాలా అవసరం. ఇంట్లో తయారుచేసిన టోనర్లు చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మారుస్తాయి.
⦿ చర్మానికి లోతైన శుభ్రత:
ఇంట్లో తయారుచేసిన టోనర్లు ముఖాన్ని లోతుగా శుభ్ర పరుస్తాయి. అంతే కాకుండా ముఖ రంధ్రాలను శుభ్రంగా ఉంచుతాయి. మొటిమల సమస్యను కూడా తగ్గిస్తాయి.
⦿ అన్ని చర్మ రకాలకు అనుకూలం:
మీ చర్మం జిడ్డుగా ఉన్నా, పొడిగా ఉన్నా లేదా సున్నితంగా ఉన్నా, ఇంట్లో తయారుచేసిన టోనర్లు అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటాయి. మీ చర్మ రకాన్ని బట్టి వీటిని తయారు చేసుకోవచ్చు.
⦿ చౌక:
ఇంట్లో టోనర్ తయారు చేసుకోవడానికి, మీకు ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలు మాత్రమే అవసరం. మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులకు ఇది చౌకైన, ప్రభావ వంతమైన ప్రత్యామ్నాయం.
హోం మేడ్ టోనర్ల తయారీ:
⦿ రోజ్ వాటర్ , గ్లిజరిన్ టోనర్:
కావలసినవి: 1 కప్పు రోజ్ వాటర్, 2 టీస్పూన్లు గ్లిజరిన్.
తయారీ విధానం: రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోండి.
ప్రయోజనాలు:
⦿ ఈ టోనర్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది.
⦿ రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. గ్లిజరిన్ తేమను లాక్ చేస్తుంది.
2. దోసకాయ, కలబంద టోనర్:
కావలసినవి: 1 చిన్న కప్పు దోసకాయ రసం, 2 టీస్పూన్ల కలబంద జెల్.
తయారీ విధానం: దోసకాయ రసం తీసి దానికి కలబంద జెల్ వేసి బాగా కలపాలి.
ప్రయోజనాలు:
⦿ ఈ టోనర్ పొడి చర్మాన్ని తేమగా చేస్తుంది
⦿ కలబంద చర్మంపై చికాకును తగ్గిస్తుంది.
3. బియ్యం నీటి టోనర్ :
కావలసినవి: 1 కప్పు బియ్యం నీళ్లు, 1 టీస్పూన్ తేనె.
తయారీ విధానం:
బియ్యాన్ని నీటిలో నానబెట్టి, దాని నీటిని ఫిల్టర్ చేయండి.ఈ నీటిలో తేనె కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రయోజనాలు:
⦿ ఈ టోనర్ చర్మాన్ని తేమగా ఉంచి మెరిసేలా చేస్తుంది.
⦿ తేనె చర్మానికి పోషణనిస్తుంది.
4. కొబ్బరి నీళ్లు, రోజ్ వాటర్ టోనర్:
కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీళ్లు, 2 టీస్పూన్ల రోజ్ వాటర్.
తయారీ విధానం:
రెండు పదార్థాలను కలిపి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయండి.
ప్రయోజనాలు:
⦿ ఈ టోనర్ చర్మాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తుంది.
⦿ కొబ్బరి నీళ్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
Also Read: బీట్ రూట్ ఫేస్ జెల్‌తో.. కొరియన్ గ్లాసీ స్కిన్ గ్యారంటీ !
5. గ్రీన్ టీ, పుదీనా టోనర్:
కావలసినవి: 1 కప్పు గ్రీన్ టీ, 5-6 పుదీనా ఆకులు.
తయారీ విధానం:
గ్రీన్ టీలో పుదీనా ఆకులను వేసి, చల్లబడిన తర్వాత, దానిని ఫిల్టర్ చేసి నిల్వ చేయండి.
ప్రయోజనాలు:
⦿ ఈ టోనర్ చర్మాన్ని డీటాక్స్ చేస్తుంది.
⦿ పుదీనా చర్మాన్ని చల్ల బరుస్తుంది.