Glowing Skin Tips: ప్రతి ఒక్కరికి ముఖం సహజంగా కాంతివంతంగా, నిగారింపుతో ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఈరోజుల్లో దుమ్ము, కాలుష్యం, సూర్యరశ్మి, ఆహారపు అలవాట్లు వంటివి చర్మంపై ప్రభావం చూపి, దాని ప్రకాశాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని దాచిపెట్టడానికి చాలామంది మార్కెట్‌లో దొరికే క్రీములు, సిరమ్స్ వాడతారు.
అయితే వాటిలో కలిసే కెమికల్స్ తాత్కాలిక మెరుపు మాత్రమే ఇస్తాయి కానీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడవు. అలాంటి సమయంలో సహజమైన పద్ధతులు, మన వంటింట్లో దొరికే పదార్థాలే నిజమైన పరిష్కారం. పూర్వం నుంచే పెద్దలు వాడే ఇంటి చిట్కాల్లో ఒకటి అరెంజ్ తొక్కలు, గులాబీ నీరు, పెరుగు, పసుపు, శనగపిండి కలిపి చేసే ఫేస్ ప్యాక్. అది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.
తయారీ విధానం
ముందుగా అరెంజ్ తొక్కలను తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడి చర్మానికి సహజంగా ఫెయిర్‌నెస్ ఇచ్చే గుణం కలిగి ఉంటుంది. ఒక స్పూన్ అరెంజ్ పొడి, ఒక స్పూన్ శనగపిండి కలిపి పెట్టుకోవాలి. శనగపిండి చర్మంపై ఉండే దుమ్మును, అదనపు ఆయిల్‌ను తొలగించి శుభ్రతనిస్తుంది. వీటికి రెండు చెంచాలు పెరుగు వేసి పేస్ట్‌లా కలపాలి. పెరుగు చర్మానికి తేమను అందించి, మృదుత్వాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు యాంటీబాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటంతో మొటిమలు, వైట్ హేర్స్, బ్లాక్ హేయిర్ తగ్గుతాయి. చివరగా రెండు మూడు స్పూన్లు గులాబీ నీరు వేసి బాగా కలిపితే సహజమైన ఫేస్ ప్యాక్ సిద్ధమవుతుంది.
Also Read: Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..
ఎలా వాడాలి?
తయారైన పేస్ట్‌ను ముందుగా శుభ్రం చేసిన ముఖంపై సమంగా రాసుకోవాలి. ముఖంపై పలచగా పూయడం కంటే కొంచెం మందంగా రాస్తే మంచి ఫలితం వస్తుంది. కళ్ళ చుట్టూ, పెదవుల దగ్గర వాడకూడదు. పూసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా కడిగేయాలి. ఒకసారి కడిగిన వెంటనే చర్మం తాజాగా, తేలికగా అనిపిస్తుంది.
ఎన్ని సార్లు వాడితే మంచిది?
ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి కనీసం రెండు సార్లు వాడితే క్రమంగా చర్మంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మంలోని డెడ్ సెల్స్ తొలగిపోతాయి. ఈ ఐదు పదార్థాల కలయికతో తయారైన పేస్ క్రమం తప్పకుండా వాడితే చర్మం ఆరోగ్యంగా మారి, సహజంగా ప్రకాశిస్తుంది. చందమామలా మెరిసే అందాన్ని ఇది అందిస్తుంది. కానీ ఒకటికి రెండు సార్లు వాడినా చర్మం మరీ మృదువుగా ఉండకూడదు. దానివల్ల చర్మం పొడిబారే సమస్య ఎదుర్కొనవలసి ఉంటుంది. అందుకే వారానికి రెండు సార్లు, లేదా ఏదైన పార్టీకి వెళ్లే ఒక గంట ముందు పెట్టుకున్నా చాలు. పరిమితికి మించి వాడితే, సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి.