E-Paper
Advertisement

Upcoming Bajaj Bikes: దుమ్మురేపే బజాజ్ బైక్స్.. హైలెట్ అవెంజర్ 400!

Upcoming Bajaj Bikes: దుమ్మురేపే బజాజ్ బైక్స్.. హైలెట్ అవెంజర్ 400!
Advertisement

Upcoming Bajaj Bikes 2026: బజాజ్ కంపెనీ కొత్త సంవత్సరంలో సరికొత్తగా అడుగు పెట్టబోతోంది. అవెంజర్ 400తో పాటు అదిరిపోయే బైక్స్ ను విడుదల చేయబోతోంది. అవెంజర్ 400 రాబోయే 11 నెలల్లో విడుదల కానుంది. అటు బజాజ్ ఆటో 2026ను పల్సర్ బ్రాండ్ 25వ ఏడాదిగా జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా పల్సర్ లైనప్‌ను పూర్తిగా రివాంప్ చేయనుంది. మల్టిపుల్ న్యూ మోడల్స్ వేవ్స్‌ లో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా GST 2.0 నిబంధనలకు అనుగుణంగా సబ్ 350cc మోడల్స్‌ పై ఫోకస్ ఉంటుంది.

బజాజ్ నుంచి రాబోయే బైక్స్ ఇవే!   

 

⦿ బజాజ్ అవెంజర్ 400 (Bajaj Avenger 400)

Advertisement

బజాజ్ అవెంజర్ 400 (Bajaj Avenger 400) క్రూజర్ బైక్. ఈ బైక్ ను ఇంకా  అధికారికంగా లాంచ్ చేయలేదు. ఇది డొమినార్ 400 ఆధారంగా రూపొందుతున్న ప్రీమియం క్రూజర్ బైక్.  రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350, హోండా హైనెస్ CB350 వంటి వాటికి పోటీగా రాబోతోంది. ఈ జనవరి 2026లో లేదంటే మిడ్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచనా ధర రూ.1.50 – 2.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. 373cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, DOHC, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ తో రానుంది. 30-35 kmpl మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే, 6 స్పీడ్ మాన్యువల్, స్లిప్పర్ క్లచ్ తో రానుంది. LED హెడ్‌ ల్యాంప్ విత్ DRLs, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్స్ పొందే అవకాశం ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ (రూమర్), రైడింగ్ మోడ్స్, పిలియన్ బ్యాక్‌ రెస్ట్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ లాంగ్ టూరింగ్, హైవే క్రూజింగ్‌కు పర్ఫెక్ట్.

⦿ న్యూ పల్సర్ 125cc మోడల్

ఈ బైక్ డిసెంబర్ 2025 చివరిలో లేదంటే జనవరి 2026లో లాంచ్ కానుంది. అంచనా ధర విషయానికి వస్తే రూ.90,000 – 1.10 లక్షలు వరకు ఉండవచ్చు. పల్సర్ N125 ఆధారంగా కొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్స్, డిజిటల్ కన్సోల్, కనెక్టెడ్ టెక్ తో రానుంది. స్పోర్టీ కమ్యూటర్‌ గా హోండా షైన్, హీరో గ్లామర్‌ కు పోటీ ఇవ్వనుంది.

Advertisement

Read Also: S-ప్రెస్సో To సెలెరియో.. చీప్ అండ్ బెస్ట్ మారుతి సుజుకి కార్లు ఇవే!

⦿ పల్సర్ NS350  

ఈ బైక్ 2026 మిడ్ ఇయర్ లేదంటే ఎండింగ్ లో లాంచ్ కానుంది. అంచనా ధర రూ.1.80 – 2 లక్షలు  ఉంటుంది. ప్రస్తుత NS400Z ఇంజన్‌ను డౌన్‌సైజ్ చేసి సబ్-350ccకు తగ్గించి తీసుకొస్తుంది.

⦿ న్యూ బజాజ్ అడ్వెంచర్ బైక్

ఈ బైక్ 2026 మిడ్ ఇయర్ లేదంటే 2027 ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ అంచనా ధర రూ. 2 లక్షల వరకు ఉంటుంది. డొమినార్ ఆధారిత 350cc అడ్వెంచర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ బైక్ TVS RTX 300కు పోటీ ఇవ్వనుంది.

Read Also: TVS నుంచి రాబోతున్న 4 బైక్‌లు.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×