Papaya For Skin: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతంది. బొప్పాయిని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో కూడా ఉపయోగిస్తారు. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, బి, సి ,పెపిన్ చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
బొప్పాయితో ఫేస్ మాస్క్ తయారు చేసి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అంతే కాకుండా యంగ్, గ్లోయింగ్ స్కిన్ కలిగి ఉండాలనుకుంటే తప్పనిసరిగా బొప్పాయి ఫేస్ ప్యాక్‌ని ప్రయత్నించాలి. మరి బొప్పాయి గ్లోయింగ్ స్కిన్ ఎలా ఉపయోగించాలి. దీని యొక్క ప్రయోజనాలను గురించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి బొప్పాయి ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు:
బొప్పాయి చర్మానికి చాలా మేలు చేస్తుంది.
దీన్ని అప్లై చేయడం వల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది.
ఇది చర్మంపై ఉన్న మచ్చలను కూడా తగ్గిస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
బొప్పాయిని చర్మంపై అప్లై చేయడానికి ముందుగా బొప్పాయి గుజ్జును తీసి దాని నుండి గింజలను వేరు చేయండి. తర్వాత దానికి అందులో కాస్త తేనె, పాలు కలపాలి. ప్యాచ్ టెస్ట్ కోసం దీన్ని మీ చేతికి లేదా మీ చెవి వెనుక అప్లై చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసిన చోట అలెర్జీ లేకపోతే, మీ ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
స్కిన్ టోన్ మెరుగుపడుతుంది:
బొప్పాయిలో పపైన్, విటమిన్ ఎ మరియు సి ఉన్నాయి. ఇవి ముఖాన్ని తెల్లగా మార్చడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తాయి.
అందుకే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, క్లియర్‌గా కనిపిస్తుంది.
చర్మం హైడ్రేట్ అవుతుంది:
బొప్పాయి చర్మ కణాలను హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపించదు. దీంతో చర్మం డ్రైగా మారే సమస్య కూడా తొలగిపోతుంది. అంతే కాకుండా చర్మం మెరుస్తూ కూడా కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చేసుకుని మీ చర్మానికి అప్లై చేసి ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు.
మొటిమలు తగ్గుతాయి:
పెపిన్ బొప్పాయిలో ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మృత కణాలను శుభ్రపరుస్తుంది. ముఖ రంధ్రాలు మూసుకుపోకుండా నిరోధిస్తుంది. కాబట్టి మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. ఇది మొటిమల గుర్తులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: ఫేస్ క్రీమ్‌లు అవసరమే లేదు.. వీటితో రెట్టింపు అందం
UV కిరణాల నుండి రక్షిస్తుంది:
సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UV కిరణాల నుండి కూడా బొప్పాయి చర్మాన్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లే దీనికి కారణం. ఈ రెండూ UV కిరణాలను నిరోధించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి .
వృద్ధాప్యం తగ్గుతుంది:
బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కొల్లాజెన్ తయారీలో సహాయపడతాయి. కాబట్టి దీన్ని అప్లై చేయడం వల్ల వృద్ధాప్య సమస్య తగ్గి చర్మంపై కనిపించే ముడతలు, ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి.