Allu Arjun : సెలబ్రిటీలపై తప్పుడు రాతలు, తప్పుడు థంబ్ నెయిల్స్ తో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రెచ్చిపోతున్నాయి. ఇలాంటివి హద్దులు దాటినప్పుడు పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎప్పటికప్పుడు సదరు యూట్యూబ్ ఛానల్ కు బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ఆగడాలు ఆగేలా కనిపించడం లేదు. దీంతో కొన్నిసార్లు స్టార్ హీరోల అభిమానుల ఆగ్రహానికి సదరు యూట్యూబ్ ఛానల్స్ బలి కావాల్సి వస్తుంది. తాజాగా హైదరాబాద్లో అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు కూడా ఇలాంటి పనే చేశారు. డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ పై దాడి చేశారు.
హైదరాబాదులో ఒక యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ పై తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు దాడి చేసిన ఘటన టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. సదరు యూట్యూబ్ ఛానల్ లో అల్లు ఫ్యాన్స్ కంప్యూటర్లు, సామాగ్రి ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. హీరో పై ఉద్దేశపూర్వకంగా నీచమైన థంబ్ నెయిల్స్ తో వీడియోలు పెట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి వీడియోలపై పలువురు స్టార్ హీరోలు స్పందిస్తూ సమయం దొరికినప్పుడల్లా ఫైర్ అవుతున్నారు.
అయితే అసలే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయనకు దేశవ్యాప్తంగా ప్రతి మూలా అభిమానులు ఉన్నారు. అలాంటి స్టార్ హీరోపై ఇలా తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తే ఊరుకుంటారా? గట్టిగా ఇచ్చి పడేసారు. అయితే ఈ దాడిలో ఎవరికైనా గాయాలు అయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సదరు యూట్యూబ్ ఛానల్ లో ఆసుపత్రి పాలైన అల్లు అర్జున్, ‘పుష్ప 2’ పోస్ట్ పోన్, చావు బతుకుల మధ్య అల్లు అర్జున్ అంటూ పెద్ద పెద్ద థంబ్ నెయిల్స్ పెట్టడం గమనార్హం.
ఇక ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మంచు విష్ణు (Manchu Vishnu)పై కూడా ఇలాగే చెలరేగిపోయిన యూట్యూబ్ ఛానల్స్ పై ఆయన కోర్టుకు ఎక్కారు. దీంతో కోర్టు పలు యూట్యూబ్ ఛానల్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పైగా ఆ వీడియోలు తొలగించాలని ఆదేశించింది. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) మాట్లాడుతూ ‘ఎలాగూ సెలబ్రిటీలపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు, చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు… సోషల్ మీడియాను తగలబెట్టేస్తాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ఇలాంటి నీచమైన ఉద్దేశపూర్వక వీడియోలు పెట్టిన యూట్యూబ్ ఛానల్ పై దాడి చేయడం గమనార్హం.
కాగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ (Pushpa 2) సందడే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ‘పుష్ప 2’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నారు.