Juice For Monsoon: వర్షాకాలం ప్రారంభమైంది. మీరు మీ ఆరోగ్యం పట్ల రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. నిజానికి.. వర్షాకాలంలో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో అనేక రకాల వైరస్‌లు, ఇన్ఫెక్షన్‌లు శరీరానికి హాని కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. రోగనిరోధక శక్తిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం చాలానే ఉంది. శరీర రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. మీరు సులభంగా ఏదైనా వ్యాధికి బలైపోతారు.
అందుకే మీరు మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలి. దీని కోసం. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవసరమైన పోషకాలను పొందడానికి ఆహారంలో ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ జ్యూస్‌లు కూడా చేర్చుకోవాలి. వర్షాకాలంలో మీరు తప్పనిసరిగా తినాల్సిన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
కివీ జ్యూస్:
కివీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది అనేక రకాల వ్యాధుల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది. వర్షాకాలంలో కివీ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్‌లెట్లు పెరగడమే కాకుండా.. కడుపు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది డెంగ్యూ, ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. అంతే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.
చెర్రీ జ్యూస్:
వర్షాకాలంలో మీరు చెర్రీ జ్యూస్ కూడా తాగవచ్చు. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో పాటు, ఇది విటమిన్లు ఎ, బి, సి, పొటాషియం యొక్క మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ నిద్రను కూడా మెరుగుపరుస్తుంది.
క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ జ్యూస్:
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి.. మీరు మీ ఆహారంలో క్యారెట్, బీట్‌రూట్, ఆపిల్ జ్యూస్‌లను కూడా తప్పకుండా చేర్చుకోవాలి. ఇవి విటమిన్ ఎ, సి, బి6 లోపాలను తగ్గిస్తాయి. అంతే కాకుండా శరీరం వ్యాధుల బారిన పడకుండా చేయడంతో పాటు అవసరం అయిన శక్తిని కూడా అందిస్తాయి.