Juice For Skin Glow: ఈ రోజుల్లో ముఖ కాంతిని కోల్పోవడం సర్వసాధారణం అయిపోయింది. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిద్ర లేకపోవడం, కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు. మార్కెట్లో లభించే ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీకు తక్షణ మెరుపును అందిస్తాయి. కానీ వీటి ప్రభావం తక్కువ రోజులు ఉంటుంది.
మీరు నిజంగా అందమైన, గ్లోయింగ్ స్కిన్ లోపలి నుండి పొందాలనుకుంటే.. ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా జ్యూస్‌లు తాగడం అలవాటు చేసుకోవాలి. అవి మీ శరీరాన్ని డీటాక్స్ చేయడమే కాకుండా.. మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా, యవ్వనంగా మారుస్తాయి. నిర్జీవమైన ముఖానికి కొత్త జీవం పోసే.. 8 జ్యూస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ రసం:
క్యారెట్లలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను రిపేర్ చేసి కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడతాయి. ఈ రసం చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మచ్చలను తొలగిస్తుంది. తరచుగా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కూడా అద్భుతమైన లాభాలు ఉంటాయి. గ్లోయింగ్ కావాలని అనుకునే వారు క్యారెట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.
బీట్‌రూట్ రసం:
బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల ముఖంపై సహజమైన గ్లో వస్తుంది. బీట్‌రూట్ రసం తాగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతే కాకుండా మొటిమల సమస్య కూడా తొలగిపోతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో కూడా బీట్ రూస్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఉసిరి జ్యూస్:
ఉసిరి జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ముడతలను కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం మీకు చాలా ఉపయోగపడుతుంది.
దోసకాయ జ్యూస్:
దోసకాయ చర్మాన్ని చల్లబరుస్తుంది. దీంతో తయారు చేసిన చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ సమ్మర్‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తరచుగా ఉపయోగించడం వల్ల మీరు అద్భుమైన ప్రయోజనాలను కలిగిస్తారు.
టమాటో జ్యూస్:
టమాటోలో లైకోపీన్ అనే మూలకం ఉంటుంది. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. దీని జ్యూస్ చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా నీరసాన్ని కూడా తొలగిస్తుంది.
కలబంద జ్యూస్:
కలబంద రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మంపై ఉన్న మలినాలను తొలగించి చర్మం శుభ్రంగా కనిపిస్తుంది.
Also Read: కొబ్బరి నీళ్లు సూపర్ డ్రింక్.. వీటిలోని పోషకాల గురించి తెలుసా ?
పాలకూర, నిమ్మరసం:
పాలకూరలో ఐరన్ , నిమ్మకాయలో విటమిన్ సి కలిసి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తాయి. ఈ జ్యూస్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
దానిమ్మ రసం:
దానిమ్మపండు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండి ఉంటుంది. ఇది చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మంపై అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. దీని జ్యూస్ రోజూ తాగడం వల్ల ముఖం ఎర్రగా , తాజాగా ఉంటుంది.