Pakistan Earthquake: పాకిస్తాన్ లో కాసేపటి క్రితం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. పాకిస్థాన్ లో భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా కుదుపులు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ తాజా భూకంపానికి సంబంధించిన అధికారికి సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. రెండు రోజుల క్రితం కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో కూడా దాయాది దేశంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రజలు ప్రాణాలు చేతిలో పట్టుకొని పరుగులు తీశారు. అది మరువక ముందే మరోసారి పాకిస్థాన్ లో భూకంపం రావడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. పాకిస్థాన్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Also Read: India Pakistan War : హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్