Adivi Sesh: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేకమైన ఫోటోను పంచుకున్నారు. ఈ ఫోటోలో నేచురల్ స్టార్ నాని ఆసుపత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటుండగా, అడివి శేష్ అదే బెడ్‌పై కూర్చొని చిరునవ్వుతో కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ అరుదైన దృశ్యానికి అడివి శేష్ ఇచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. “బ్రదర్ ఫ్రం అనొథెర్ మదర్..” అంటూ నానిపై తన ప్రేమను కురిపించారు అడివి శేష్. అంతేకాదు, ఈ అందమైన క్షణాన్ని కెమెరాలో బంధించింది మరెవరో కాదు.. అందాల తార శ్రీనిధి శెట్టి..
బ్రదర్ ఫ్రొం అనొథెర్ మదర్..
ఈ ఫోటో చూసిన వెంటనే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒకవైపు ఆసుపత్రి వాతావరణం కాస్త విషాదంగా అనిపిస్తుంటే, మరోవైపు అడివి శేష్, నాని మధ్య ఉన్న అనుబంధం ఆ దృశ్యానికి ప్రత్యేకమైన వెలుగును నింపుతోంది. “వామ్మో.. ఏంటి ఇంత పెద్ద డైలాగ్ కొట్టాడు!” అంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతుంటే, మరికొందరు వారి స్నేహాన్ని చూసి మురిసిపోతున్నారు. అయితే, ఈ ఫోటో వెనుక అసలు కథ వేరే ఉంది. ఇది ఇటీవల విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్ 3’లోని ఒక వర్కింగ్ స్టిల్. ఈ సినిమాలో నాని లీడ్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. సినిమాలోని ఒక సన్నివేశంలో నాని ఆసుపత్రిలో ఉండగా, అడివి శేష్ అతన్ని కలిసిన సందర్భం ఇది. సినిమాలోని అడవి శేస్ క్లైమాక్స్ లో క్యామియో రోల్ ప్లే చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్ తో హిట్ 3 దూసుకుపోతోంది.
ఏది ఏమైనప్పటికీ, అడివి శేష్ తన స్నేహితుడైన నాని పట్ల చూపించిన ఆత్మీయత అందరినీ కట్టిపడేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకరి పట్ల ఒకరు ఇంత ప్రేమ, గౌరవం చూపించుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ ఫోటో ద్వారా వారి మధ్య ఉన్న బలమైన బంధం స్పష్టంగా కనిపిస్తోంది.
హిట్ 3 హీరోస్ ..
శ్రీనిధి శెట్టి క్లిక్ చేసిన ఈ అద్భుతమైన ఫోటో, అడివి శేష్ ఇచ్చిన హృదయపూర్వకమైన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూసి సంబరపడుతున్నారు. ‘హిట్ 3’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ తరుణంలో నాని అభిమానులకు ఈ ఫోటో ఒక మంచి ట్రీట్‌లాంటింది. ఇదిలా ఉంటే.. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన చిత్రం హిట్ 3 ది థర్డ్ కేస్. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 1న విడుదలై బాక్సాఫీస్ వద్దు భారీ వసూల్లు రాబడుతోంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరింది హిట్ 3.
Brother From Another Mother #HIT3
Pic Courtesy 📸 @SrinidhiShetty7 🔥 pic.twitter.com/sgi7IjISoi
— Adivi Sesh (@AdiviSesh) May 12, 2025