E-Paper
Advertisement

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?

భార్యాభర్తల మధ్య దూరం అక్రమ సంబంధాలకు దారితీస్తుందా?
Advertisement

Extramarital Affairs:పెళ్లయిన మొదట్లో భార్యాభర్తలిద్దరూ చాలా చనువుగా ఉంటారు. ఈ క్రమంలో ఏ చిన్న విషయమైనా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఎక్కడికి వెళ్లినా, ఏం జరిగినా, ఏం చేసినా ప్రతిదీ ఒకరి మధ్య ఒకరికి షేర్ అయిపోవాల్సిందే.

అంతా పంచుకునే బంధం

కానీ రోజులు గడిచే కొద్దీ బాధ్యతలు పెరిగిపోతాయి. ఇల్లు, ఉద్యోగం, పిల్లలు, సంసారం… ఇలా పనులన్నీ మీద పడిపోయేసరికి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లు కాస్తా రెండు మాటలు కూడా మాట్లాడుకోలేని పరిస్థితికి వెళ్లిపోతారు. దాంతో అప్పటిదాకా చనువుగా సమయం దొరికితే మాట్లాడుకునే వాళ్లు కాస్త ఇప్పుడు “మా మధ్య దూరం పెరిగింది”, “నన్ను పట్టించుకోవట్లేదు”, “ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒకటే” అన్న ఫీలింగ్ అందరికీ వచ్చేస్తుంది. దీనివల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా వస్తాయి.

బాధ్యతలు పెరిగేకొద్దీ పెరిగే దూరం

Advertisement

అలాంటి సమయంలోనే కొంతమంది తమ బాధను ఇంట్లో చెప్పకుండా బయటి వాళ్లతో చెప్పడం మొదలెడతారు. ఆఫీస్, ఓల్డ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా… ఇలా ఏదైనా కావచ్చు. మొదట్లో మామూలుగా మొదలైన మాటలు తర్వాత రోజూ మాట్లాడుకునే స్థాయికి వెళ్లిపోతాయి. మెల్లిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారనే భావన పెరిగితే ఆ పరిచయం ఇంకాస్త దగ్గర అవుతుంది.

మనసులో మాట బయటివాళ్లతో పంచుకుంటే…

కొన్ని సందర్భాల్లో అదే అక్రమ సంబంధానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… భార్యాభర్తల మధ్య దూరం ఉందంటే అందరూ అలాంటి తప్పు చేస్తారనే కాదు. అలా అనుకోవడం కరెక్ట్ కాదు కూడా. చాలామంది ఎన్ని కష్టాలు వచ్చినా బంధాన్ని కాపాడుకుంటారు.

అక్రమ సంబంధాలకు అసలు కారణాలు ఇవే

Advertisement

ఎందుకంటే వాళ్లకి కుటుంబం విలువ తెలుసు కాబట్టి. ఇక అక్రమ సంబంధానికి కారణం దూరం ఒక్కటే కాదు. నమ్మకం లేకపోవడం, ఒకరినొకరు గౌరవించుకోకపోవడం, చిన్న సమస్యలను పెద్దవిగా చూడటం… అన్నిటికీ మించి పక్కనున్న భార్యను పట్టించుకోకుండా మొబైల్‌లోనే ఎక్కువసేపు గడపడం.

అనుమానం వస్తే ఆరోపణలు కాదు… మాట్లాడుకోవాలి

ఇలా బోలెడన్ని కారణాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ప్రతి రోజు ఎన్ని పనులున్నా కొద్దిసేపైనా లైఫ్ పార్టనర్‌తో గడపడం, మాట్లాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే బయట ప్రతి సమస్యకి పరిష్కారం ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు మాట్లాడుకుంటే మాత్రం చాలా సమస్యలు తీరిపోతాయి.

also read :మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

ఇక్కడ మరో విషయం ఏంటంటే… అనుమానం వచ్చిందంటే వెంటనే ఆరోపణలు చేయడం మంచిది కాదు. అలా చేస్తే మధ్య ఉన్న బంధం కూడా బీటలు వారే అవకాశం ఉంటుంది. సో ముందు నిజమేంటో తెలుసుకొని, ఆ తర్వాత ప్రశాంతంగా మాట్లాడి ఒక డిసిషన్ తీసుకోవాలి.

ప్రేమ, నమ్మకం, గౌరవమే దాంపత్యానికి బలం

చివరిగా చెప్పాలంటే… భార్యాభర్తల మధ్య దూరం పెరగడం ఒక వార్నింగ్ కావచ్చు. కానీ అదే అక్రమ సంబంధానికి దారితీస్తుందని చెప్పలేం. బంధం నిలబడాలంటే ప్రేమతో పాటు నమ్మకం, గౌరవం, నిజాయితీ కూడా ఉండాలి. ఈ నాలుగు ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఇద్దరు కలిసి ఎదుర్కోగలరు. ఇదే అసలైన దాంపత్య జీవితానికి బలం.

Tags

Related News

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

చిన్న వయసులోనే పేరు, గుర్తింపు పొందుతారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి అతిత్వరగా విజయాలు సాధిస్తారు

మంచి వ్యక్తుల ఈ అలవాట్లే వారి బలహీనతలు.. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

ఆఫీస్ డెడ్‌లైన్లు, మీటింగ్‌లతో సతమతమవుతున్నారా? స్ట్రెస్ తగ్గేందుకు 5 నిమిషాలు ఇలా చేయండి!

వాడిన టీ బ్యాగ్స్ పారేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే.. వాటివల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Big Stories

Advertisement
×