Kia India Announces August 2026 Discounts: కియా ఇండియా అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 2026కు సంబంధించి పలు కార్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్ లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల సైరోస్ EV, సోరెంటో SUV లాంటి కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన కంపెనీ, ఇప్పుడు అమ్మకాలను మరింత పెంచేందుకు ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.
కియా కేరెన్స్ క్లావిస్ మీద ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ MPVపై మొత్తం రూ.1.2 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. MY26 మోడళ్లపై రూ.10,000 వరకు నగదు తగ్గింపు, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్, రూ.15,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, అలాగే రూ.30,000 వరకు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. MY25 మోడళ్లపై రూ.75,000 వరకు నగదు తగ్గింపు లభిస్తున్నప్పటికీ కార్పొరేట్ ఆఫర్ ఉండదు. టర్బో పెట్రోల్ వేరియంట్ కొనుగోలు చేసే వారికి ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందిస్తున్నారు.
కియా కార్నివాల్పై ఈ నెలలో అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. MY26 వేరియంట్ కొనుగోలు చేస్తే రూ.1 లక్ష వరకు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్‌తో పాటు రూ.50,000 వరకు కార్పొరేట్ ఆఫర్ లభిస్తుంది. MY25 మోడళ్లకు రూ.20,000 స్క్రాపేజ్ బెనిఫిట్ మాత్రమే అందుబాటులో ఉంది.
కేరెన్స్ క్లావిస్ EV కొనుగోలుదారులకు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ MPVపై మొత్తం రూ.55,000 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో లాయల్టీ బెనిఫిట్, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. MY25 ఎక్స్ టెండెడ్ రేంజ్ వేరియంట్‌పై కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తున్నారు.
కొత్త కియా సైరోస్ SUVపై రూ.50,000 వరకు బెనిఫిట్స్ ప్రకటించారు. MY26 మోడళ్లపై నగదు తగ్గింపు, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. MY25 మోడళ్లకు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటుంది. కొన్ని వేరియంట్‌లకు ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఇస్తున్నారు.
కియా సోనెట్ కొనుగోలు చేసే వారికి రూ.45,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. MY26 వేరియంట్‌పై నగదు తగ్గింపు, కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి. MY25 మోడళ్లకు స్క్రాపేజ్ ఆఫర్ మాత్రమే వర్తిస్తుంది. సెకెండ్ జెనరేషన్ కియా సెల్టోస్ పై రూ.40,000 వరకు బెనిఫిట్స్ ప్రకటించారు. ఇందులో లాయల్టీ బెనిఫిట్‌తో పాటు స్క్రాపేజ్ బోనస్ కూడా ఉంది. బడ్జెట్ MPV కియా కేరెన్స్ పై కూడా రూ.35,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: టాటా ఎలక్ట్రిక్ కార్లపై సూపర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల తగ్గింపు!