Siberian: రష్యాలోని సైబీరియా ల్యాబ్‌లో జరిగిన బ్యాక్టీరియా ప్రమాదం ఎందుకు అంతక ప్రమాదకరమైనది? ఈ ఘటనను అంతర్జాతీయ మీడియా వుహాన్ పార్ట్-2 ఎందుకు పోల్చుతోంది. అసలు సైబీరియాలోని ప్లేగు నిరోధక పరిశోదనా సంస్థలో అసలు ఏం జరిగింది? ఆ మహిళ ఎందుకు చనిపోయింది? ఎందుకు 200 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రష్యా సైబీరియా ప్రాంతంలో ఇర్కుట్స్క్ ప్రాంతంలోవున్న ప్లేగు నిరోధక పరిశోధనా సంస్థలో తీవ్రమైన ఘటన జరిగింది. ఆ ప్రయోగశాలకు చెందిన 28 ఏళ్ల ఓ ఉద్యోగిని ప్లేగు బ్యాక్టీరియా ద్వారా మరణించిన సమాచారం తీవ్ర కలకలం రేపుతోంది. నమూనాలను పరీక్షిస్తుండగా ఓ టెస్ట్ ట్యూబ్ పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానిక పత్రికలు చెబుతున్నాయి. ఆమెతో సన్నిహితంగా మెలిగిన దాదాపు 200 మందిని అప్పటి నుండి వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని రాసుకొచ్చింది.
ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి కారణంగా ఒకరు మరణించినట్లు రష్యా అధికారులు ధృవీకరించారు. మరణించిన మహిళ ప్రయోగశాల ప్రమాదం, ఆ వ్యాధి సోకిన తీరు న్యుమోనిక్ ప్లేగు అని రష్యా మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ప్రయోగశాల సాంకేతిక నిపుణురాలు డారియా షిపిలోవాగా గుర్తించింది. నమూనాలను సేకరిస్తున్నప్పుడు బ్యాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్‌ను ప్రమాదవశాత్తు పగులినట్టు ఆమె వైద్య సిబ్బందికి చెప్పిందట. ఆ తర్వాత ఆమెకు తీవ్రమైన న్యుమోనియా వంటి లక్షణాలు ఉన్నాయి. ఇర్కుట్స్క్ సమీపంలోని షెలెఖోవ్ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చేర్చారు.
ఆమెను వెంటిలేటర్‌పై ఉంచినప్పటికీ కొన్ని రోజుల చికిత్స తర్వాత సదరు మహిళ మృతి చెందింది. కొన్ని నివేదికలు ఆ బ్యాక్టీరియాను ప్లేగు వ్యాధిని కలిగించే యోర్సినియో పెస్టిస్‌గా గుర్తించాయి. రష్యా ఆరోగ్య సంస్థ మాత్రం అలాంటి ఘటన ఏమీ జరగలేదని చెబుతోంది. ల్యాబ్ ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం మహమ్మారి లాంటి పరిస్థితి నెలకొని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 200 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆసుపత్రులను క్వారంటైన్ చేశారు.
ప్లేగు ఓ పురాతనమైనప్పటికీ ప్రమాదకరమైన వ్యాధి. దీనికి మూడు ప్రధాన రూపాలు ఉన్నాయని, వాటిలో న్యుమోనిక్ ప్లేగు అత్యంత తీవ్రమైనదిగా చెబుతున్నారు. ఇది శ్వాసకోశ తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. సకాలంలో యాంటీ బయాటిక్ చికిత్స అందించకపోతే మరణాల రేటు ఎక్కువగా ఉండవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాప్తి జరిగినట్లు నిర్ధారణ కాలేదు. చల్లని వాతావరణం వ్యాప్తిని నెమ్మదింప జేయడంలో సహాయపడగలదని చెబుతున్నారు. ప్రయోగశాల వాతావరణంలో అధిక ప్రమాదం ఉన్న బ్యాక్టీరియాతో పని చేయడం తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని అంటున్నారు.
మొత్తమ్మీద ఈ ముప్పు స్థానికంగా అదుపులో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ పారదర్శకత లోపించడం, ఆదిలో నెలకొన్న అస్పష్టత కారణంగా ఆందోళనలు పెంచాయి. కొన్ని రష్యన్ టెలిగ్రామ్ ఛానెళ్లు, కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు.. ఈ సంఘటనను వుహాన్-2 వైరస్‌తో పోలుస్తున్నాయి. కోవిడ్-19 పుట్టిన వుహాన్‌లోని ల్యాబ్‌లో వైరస్ లీక్ అయిందని, పరిశోధనా సంస్థ ఇన్ఫెక్షన్‌కు కారణమైనట్టు చాలా కాలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లేగు నిరోధక ల్యాబ్‌తో ముడిపడిన మరణాలు, పగిలిన టెస్ట్ ట్యూబ్‌ల నివేదికలు, ఆసుపత్రుల క్వారంటైన్‌లు, అధికారులు మొదట్లో ఇన్ఫెక్షన్ కారణం తెలియదని నివేదించడం వంటి అంశాలతో పోలికలు చూపుతున్నారు.
ఈ రెండు కేసుల మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఈ మహమ్మారికి నివారణ ఉందని అంటున్నారు. రోగి నమూనాలలో ఎలాంటి సూక్ష్మజీవులు బయటపడలేదని రోస్పోట్రెబ్నాడ్జోర్ తెలిపింది. స్థానిక మీడియా కొంతమంది అధికారులు ప్లేగు వ్యాధి సోకే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో పుకార్లు వేగంగా వ్యాపించాయి. వుహాన్ పార్ట్-2 వంటి పదాలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అధిక-ప్రమాదకర ప్రయోగశాలలు టీకాలు, చికిత్సలను అభివృద్ధి చేయడానికి బ్యాక్టీరియా, వైరస్‌లపై పరిశోధనలు నిర్వహిస్తాయి. భద్రతా లోపాల కారణంగా అంటువ్యాధులు వ్యాపించిన అనేక ప్రయోగశాల ప్రమాదాలు చరిత్రలో నమోదయ్యాయి. ఈ సంఘటన మరోసారి నొక్కి చెబుతోంది. రష్యాలోని కొన్ని ప్రాంతాలలో ప్లేగు సహజంగా సంభవిస్తోందని, కాబట్టి పరిశోధన అవసరమని అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. పరిస్థితి అదుపులో ఉందని సమాచారం.
BREAKING:
5 hospitals have been closed for quarantines in Siberia due to a possible plague outbreak.
The 28-year-old lab technician Darya Shipilova, died yesterday after breaking a test tube with live Yersinia pestis the Irkutsk Anti-Plague Institute on September 25th while… pic.twitter.com/N6tKLRyAJ5
— Visegrád 24 (@visegrad24) October 4, 2026
A researcher at Russia’s Anti-Plague Research Institute in Shelekhov, Siberia, has died after contracting pneumonia of “unknown” cause following a suspected laboratory accident.
The head of neighboring Buryatia said the 28-year-old woman may have died from plague, while health… pic.twitter.com/pfSK4q8GHN
— Clash Report (@clashreport) October 4, 2026