E-Paper
Advertisement

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!
Advertisement

Honda Cars October Offers 2026:  పండుగ సీజన్‌ లో కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి హోండా కార్స్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2026లో తన కార్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటించింది. హోండా ఎలివేట్‌పై అత్యధికంగా రూ.2.34 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. సిటీ, న్యూ అమేజ్, సెకెండ్ జెనరేషన్ అమేజ్‌పైనా సూపర్ ఆఫర్లు ఉన్నాయి.

ఎలివేట్‌పై రూ.2.34 లక్షల వరకు ఆఫర్!

హోండా అక్టోబర్ ఆఫర్లలో ఎలివేట్ పై భారీగా ఆఫర్ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీపై గరిష్ఠంగా రూ.2,34,600 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఎలివేట్ ప్రారంభ ధర సుమారు రూ.11.81 లక్షలు ఉండటంతో ఈ ఆఫర్ ద్వారా కొనుగోలుదారులకు అదిరిపోయే ప్రయోజనాలు అందిస్తోంది. ఎలివేట్‌లో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని మాన్యువల్, CVT గేర్‌బాక్స్‌ తో ఎంచుకోవచ్చు. ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో మార్కెట్‌లోకి రానుంది. అక్టోబర్ 6న కొత్త వెర్షన్ విడుదల కానున్న నేపథ్యంలో, ప్రస్తుత మోడల్‌పై డీలర్లు సూపర్ డీల్ ఇచ్చే అవకాశం ఉంది.

హోండా సిటీపై సూపర్ బెనిఫిట్స్!   

Advertisement

ఎలివేట్ తర్వాత అత్యధిక ప్రయోజనం హోండా సిటీపై లభిస్తోంది. ఈ సెడాన్‌పై రూ.1,70,900 వరకు ప్రయోజనాలను కంపెనీ ప్రకటించింది. సిటీ చాలా కాలంగా భారత మార్కెట్లో కొనసాగుతున్న ప్రముఖ సెడాన్‌లలో ఒకటి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలు వేరియంట్‌ను బట్టి అందుబాటులో ఉంటాయి.

కొత్త అమేజ్‌పై రూ.66,800 వరకు తగ్గింపు

హోండా ఇటీవల తీసుకొచ్చిన థర్డ్ జెనరేషన్ అమేజ్‌పైనా ఈ నెలలో ఆఫర్లు ఉన్నాయి. కొత్త అమేజ్‌పై రూ.66,800 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. దీని ప్రారంభ ధర రూ.7.65 లక్షలు. కొత్త తరం అమేజ్‌లో గత మోడల్‌తో పోలిస్తే ఫీచర్లు మరింత పెరిగాయి. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో ADAS లాంటి అధునాతన భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రెండో తరం అమేజ్‌పైనా ఆఫర్!

Advertisement

కొత్త అమేజ్‌తో పాటు రెండో తరం అమేజ్ కూడా కంపెనీ లైనప్‌లో కొనసాగుతోంది. పాత అమేజ్‌పై రూ.57,600 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ.6.98 లక్షలు. తక్కువ ప్రారంభ ధరతో పాటు పండుగ ఆఫర్ కూడా ఉండటంతో బడ్జెట్‌లో కారు కొనాలని చూస్తున్న వారికి ఈ మోడల్ మరో ఎంపికగా నిలుస్తోంది.

కార్లు కొనేముందు ఈ విషయం తెలుసుకోండి!  

పండుగ సీజన్‌ లో హోండా కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్లు అనుకూలంగా ఉంటాయి. అయితే, వాస్తవంగా లభించే డిస్కౌంట్, క్యాష్ బెనిఫిట్, ఇతర ప్రయోజనాలు వేరియంట్, డీలర్, ఆఫర్ నిబంధనలను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కారు బుక్ చేసే ముందు డీలర్ దగ్గర పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Read Also: మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

Tags

Related News

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

Big Stories

Advertisement
×