CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తాజా రాజకీయ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వంపై మరోసారి పదునైన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమాలు, కేంద్రంలోని బిజెపి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవినీతి కూపంలో కుమార్
జ్ఞానేశ్వర్ మిశ్రా అవినీతి వ్యవహారం కేరళలో మొదలై, ఈరోజు దేశవ్యాప్తంగా మారేమోగుతోందని నారాయణ తెలిపారు. ఇందులో కీలక పాత్ర పోషించిన కుమార్ పదవికి రాజీనామా చేయాలని వాడవాడలా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. ఆ అవినీతి కూపంలో కూరుకుపోయిన కుమార్, రాజకీయంగా ఇక జీవచ్ఛవంతో సమానమని ఎద్దేవా చేశారు.
UPLతో ప్రజల జేబులకు చిల్లు
ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని, సందిట్లో సడేమియా లాగా ప్రభుత్వం UPLను ప్రవేశపెట్టిందని నారాయణ మండిపడ్డారు. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ‘ఓట్ల చోరీ + జోబీ చోరీ’ కి పాల్పడుతోందని, ఇది కేవలం శవాలపై పేలాలు ఏరుకునే నీచ మనస్తత్వానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read: KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ ప్లాన్ క్యాన్సిల్! అసలు ఏం జరిగిందంటే..?
మోదీ మెడకు చుట్టుకోనున్న సీఈఓ రాజీనామా
గతంలో విద్యామంత్రి రాజీనామా చేయడంతో మోదీ ప్రభుత్వం పెద్ద గండం నుంచి బయటపడిందని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కుమార్ ఉదంతం నడుస్తున్న వేళ, సీఈఓ రాజీనామా వ్యవహారం నేరుగా ప్రధాని మోదీ మెడకే చుట్టుకునేలా ఉందన్నారు. ఈ సంక్షోభం నుంచి మోదీ బిజెపి ప్రభుత్వాన్ని ఎలా గట్టెక్కిస్తారో చూడాలని నారాయణ వ్యాఖ్యానించారు.
ఓట్ల చోరీ.. జేబుల చోరీ: సీపీఐ నారాయణ
NDA సర్కార్ ఒకవైపు ఓట్ల దొంగతనానికి పాల్పడుతూ, మరోవైపు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వేసి సామాన్యుల జేబులు గుల్ల చేస్తోంది: సీపీఐ నేత కె.నారాయణ
కార్పొరేట్లకు రూ.13లక్షల కోట్లు దోచిపెట్టిన కేంద్రం, బ్యాంకుల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది… pic.twitter.com/2OjS4cy2Q6
— BigTV APP (@BigtvApp) October 5, 2026