E-Paper
Advertisement

OTT Movie : భార్య మర్డర్ కి భర్త స్కెచ్ … ప్రియురాలితో కలసి ఆ పని … ఊహించని మలుపుతో పిచ్చెక్కించే సినిమా

OTT Movie : భార్య మర్డర్ కి భర్త స్కెచ్ … ప్రియురాలితో కలసి ఆ పని …  ఊహించని మలుపుతో పిచ్చెక్కించే  సినిమా
Advertisement

OTT Movie : ఓటీటీ లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ వుంది. ఈ సినిమాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకుంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో భార్యను చంపటానికి భర్త ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఇతని గర్ల్ ఫ్రెండ్  కూడా  హెల్ప్ చేస్తుంది. ఈ క్రమంలో మూవీ స్టోరీ మలుపు తీసుకుంటుంది.  ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..

జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో

Advertisement

2022 లో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెత్ ఆన్ ది నైల్’ (Death on the Nile). ఈ మూవీకి కెన్నెత్ బ్రనాగ్ దర్శకత్వం వహించారు. 1937లో క్రిస్టీ రాసిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. దీనిని బ్రనాగ్, రిడ్లీ స్కాట్, జూడీ హాఫ్‌లండ్ మరియు కెవిన్ J. వాల్ష్ నిర్మించారు. ఇందులో అన్నెట్ బెనింగ్, రస్సెల్ బ్రాండ్, అలీ ఫజల్, డాన్ ఫ్రెంచ్, గాల్ గాడోట్, ఆర్మీ హామర్, వోన్‌రైట్‌, సోఫీ లెట్‌ఫెరియో, రస్సెల్‌ బ్రాండ్‌ నటించారు.డిటెక్టివ్ హెర్క్యూల్ పాయిరోట్ ఒక సంక్లిష్టమైన హత్య కేసును పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు.ఆ తరువాత జరిగే సన్నివేశాలతో స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ $137 మిలియన్లను వసూలు చేసింది. ‘ఎ హాంటింగ్ ఇన్ వెనిస్’ పేరుతో ఒక సీక్వెల్ 2023 లో విడుదలైంది, బ్రానాగ్ మరోసారి దర్శకత్వం వహించి పోయిరోట్‌గా నటించాడు.ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

హెర్క్యూల్ పాయిరోట్ అనే వ్యక్తి ఒక ప్రఖ్యాత బెల్జియన్ డిటెక్టివ్ గా ఉంటాడు.సెలవులో ఈజిప్ట్‌ కి వెళ్ళి గడుపుతుంటాడు.అక్కడ అతను ఒక విలాసవంతమైన నైలు నది క్రూయిజ్‌లో గడుపుతాడు. అక్కడ ఒక ధనవంతురాలైన యువతి లినెట్ తన కొత్త భర్త సైమన్ ‌తో హనీమూన్‌కి వచ్చి ఉంటుంది. లినెట్‌కు ఆమె స్నేహితురాలు జాక్వెలిన్ అనే మహిళతో కొన్ని సమస్యలు ఉంటాయి, ఎందుకంటే జాక్వెలిన్‌కు సైమన్‌తో ఇదివరకే పడక పరిచయం ఉంటుంది. ఈ క్రమంలో లినెట్, జాక్వెలిన్ పై ఓ కన్ను వేస్తుంది. ఆమె వారిని వెంబడిస్తూ క్రూయిజ్‌లోనే ఉంటుంది.

అయితే అప్పుడే ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. క్రూయిజ్ లోనే లినెట్ హత్యకు గురవుతుంది. పాయిరోట్ ఈ కేసును చేపట్టి, ఓడలోని ప్రయాణీకులను ఒక్కొక్కరినీ పరిశీలిస్తాడు. అందరికీ లినెట్‌తో ఏదో ఒక విధంగా సంబంధం, లేకపోతే ద్వేషం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రయాణీకులలో లినెట్ కు నమ్మకమైన సేవకురాలు, ఒక వైద్యుడు, ఒక రచయిత్రి, ఇతర ధనవంతులైన వ్యక్తి  ఉంటారు. కథలో ఎన్నో ట్విస్ట్‌లు, రహస్యాలు వెల్లడవుతాయి. చివరికి పాయిరోట్ తన తెలివితేటలతో హంతకుడు ఎవరో కనిపెడతాడు. అసలు ఈ హత్య వెనుక జాక్వెలిన్, సైమన్ కలిసి పన్నిన పథకం ఉందని తెలుస్తుంది. వారు లినెట్ ఆస్తి కోసం ఈ హత్యకు ప్లాన్ చేస్తారు. అయితే పాయిరోట్ వారి కుట్రను బయటపెడతాడు.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×