BigTV English

Screen Strain Eye Health: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

Screen Strain Eye Health: ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడడంతో కంటి సమస్యలు.. ఈ సెటింగ్స్ తో మీ ఆరోగ్యం కాపాడుకోండి!

Screen Strain Eye Health| ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ప్రజలు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. అంతలా స్మార్ట్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ముందు ఫోన్లంటే కాల్స్ చేసేందుకు, మెసేజెస్ పంపెందుకు లేదా సంగీతం వినేవరకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు వీడియోలు చూడడం, సోషల్ మీడియా, ఎంటర్ టైన్మెంట్, ఆన్ లైన్ పేమెంట్స్ చేయడం.. ఇంకా ఎన్నో పనులు చేతిలో స్మార్ట్ ఫోన్ తో జరిగిపోతున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అందరూ స్మార్ ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. కానీ ఇలా గంటల తరబడి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను చూస్తూ ఉంటే కంటి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణలు హెచ్చరిస్తున్నారు.


అందుకే ప్రతిరోజు స్మార్ట్ ఫోన్ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. దీని కోసం ఫోన్ లోనే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. వాటిని మనం సెట్ చేసుకుంటే స్క్రీన్ చూసే టైమ్ ని మనం తగ్గించుకోవచ్చు. లేదా యాప్ యూసేజ్ ని తగిన సమయానికి నియంత్రిచవచ్చు.

Also Read: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..


మీరు ఒకవేళ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపుతూ వ్యసనానికి గురవుతున్నట్లు అనిపిస్తే.. మీరు దానికి లిమిట్ సెట్ చేసుకోవడానికి ఇలా సెట్టంగ్స్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి ఈ స్టెప్స్ పాటించండి
1. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ లో వెళ్లండి

2. అందులో డిజిటల్ వెట్ బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్ చూడండి

3. ఈ ఆప్షన్ లో అన్ని యాప్ లిమిట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ అప్షన్ మీ ఫోన్ యూసేజ్‌ని నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.

4. యాప్ లిమిట్స్ లో మీరు ఎక్కువగా ఉపయోగించే ఏదైనా యాప్ కు టైమ్ లిమిట్ సెట్ చేయండి. ఉదాహరణకు ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ ఉపయోగిస్తూ.. ఎక్కువ సమయం వినియోగిస్తుంటే అందులో డైలీ యూజ్ యాప్ లిమిట్ 30 నిమిషాలు (ఉదాహరణ) సెట్ చేయండి.

5. ఒక్కసారి యాప్ లిమిట్ సెట్ చేసిన తరువాత ఆ యాప్ ఎక్కువ సేపు ఉపయోగిస్తే.. ఆ యాప్ ఐకాన్ గ్రే కలర్ లో కనిపిస్తుంటుంది. ఆ తరువాత ఆ యాప్ మీరు ఉపయోగించలేరు. ఒకవేళ ఎక్కువ సేపు చూడాలంటే మళ్లీ సెటింగ్స్ లోకి వెళ్లి యాప్ లిమిట్ మార్చుకోవాలి.

Also Read: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

స్మార్ట్ ఫోన్ లో ఈ ఫీచర్ ఉపయోగించడం వల్ల మీ ఫోన్ వ్యసనాన్ని నియంత్రించుకోవచ్చు. పైగా యాప్ డైలీ యూసేజ్‌ని తగ్గించుకోవచ్చు. అన్నింటి కంటే ముఖ్యంగా ఫోన్ స్క్రీన్ నుంచి మీ కంటికి హాని కలగకుండా జాగ్రత్త పాటించవచ్చు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×