BigTV English

Kayadu Lohar: రెమ్యూనరేషన్ పెంచిన డ్రాగన్ బ్యూటీ.. ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు

Kayadu Lohar: రెమ్యూనరేషన్ పెంచిన డ్రాగన్ బ్యూటీ.. ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటుందో తెలిస్తే నోరెళ్లబెడతారు

Kayadu Lohar: కొంతమంది హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. అలా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేస్తూ ఎప్పుడు హిట్ వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎప్పుడో ఒకసారి వారి అదృష్టం తలుపు తట్టినట్లుగా ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత వారికి వరుస అవకాశాలు వస్తాయి.అయితే అలాంటి హీరోయిన్లలో నటి కయాదు లోహర్ (Kayadu Lohar) కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన డ్రాగన్ మూవీ తో కాయాదు లోహర్ కి భారీ క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలైన రోజు నుండే ఈ హీరోయిన్ కి క్రేజ్ భారీగా పెరిగి పోయింది.అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ అనుపమ ఉన్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకున్న వారే లేరు. కయాదు లోహర్ అనుపమని బీట్ చేసింది..


వరుస చిత్రాలతో బిజీగా మారిన డ్రాగన్ బ్యూటీ..

అలా డ్రాగన్ మూవీతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ చేతిలో అరడజన్ సినిమాల దాకా ఉన్నాయని తెలుస్తోంది. అవి కూడా స్టార్ హీరోల సినిమాలే. అయితే డ్రాగన్ మూవీ తో హిట్ కొట్టి ఆఫర్స్ రావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.. 2021లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కాయాదు లోహర్ ఆ తర్వాత మలయాళ,తెలుగు, మరాఠి సినిమాలు కూడా చేసింది.అలా తెలుగులో శ్రీవిష్ణు తో అల్లూరి సినిమా చేసినప్పటికీ పేరు రాలేదు. కానీ డ్రాగన్ మూవీతో మాత్రం ఈ హీరోయిన్ కి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది.ఈ సినిమా హిట్ తో హీరోయిన్ ని సినిమాలో పెట్టుకోవడానికి దర్శక నిర్మాతలు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తమిళ స్టార్ హీరోలైన శింబు, ధనుష్ లు కూడా ఈ హీరోయిన్ ని తమ సినిమాలో తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాయాదు లోహర్ నటుడు అధర్వ మురళి మూవీ,జీవి ప్రకాష్ తో ఇమ్మార్టెల్ సినిమాలు చేస్తుంది. అలాగే శింబు 49వ సినిమాలో కూడా కయాదు లోహర్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందట.


ఒక్కో సినిమాకి రూ.3 కోట్లా..?

అంతే కాకుండా ధనుష్, విజ్ఞేష్ రాజా కాంబోలో వస్తున్న సినిమాతో పాటు , ధనుష్ డైరెక్టర్ తమిళరసన్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా కాయాదు లోహర్ ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అలా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది.డ్రాగన్ మూవీకి 30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఒక్క హిట్టుతో కాయాదు లోహర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.

Samantha: అమ్మను గుర్తు చేసుకుని స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన సమంత

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×