Pumpkin Face Mask: గ్లోయింగ్ స్కిన్ కోసం అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటిని రసాయనాలతో తయారు చేయడం వల్ల ఎక్కువగా వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. హోం రెమెడీస్ వాడటం మంచిది. గ్లోయింగ్ స్కిన్ కోసం గుమ్మడికాయను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గుమ్మడి కాయతో ఫేస్ ప్యాక్ తయారు చేసి కూడా వాడవచ్చు. ఇది ముఖంపై ఉన్న మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. గుమ్మడి కాయలో ఉండే పోషకాలు చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గుమ్మడి కాయతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడికాయను ఉపయోగించడం ద్వారా మీ ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. గుమ్మడికాయలో మంచి మొత్తంలో పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, విటమిన్ ఎ,ఇ, సి, బి-6 , నియాసిన్ ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం అవుతాయి. కాబట్టి ఖరీదైన పార్లర్ ట్రీట్‌మెంట్‌ల కోసం డబ్బు ఖర్చు చేసే బదులు, తక్షణ గ్లో ఇచ్చే గుమ్మడికాయ ఫేస్ ప్యాక్ ను ఇలా తయారు చేసుకుని వాడండి.
1. గుమ్మడికాయ, పెరుగు ఫేస్ ప్యాక్:
కావలసినవి :
అరకప్పు- గుమ్మడికాయ ముక్కలు
2 టేబుల్ స్పూన్లు- పెరుగు
1 టేబుల్ స్పూన్- తేనె
తయారీ విధానం:
ముందుగా గుమ్మడికాయ తురిమి మెత్తగా చేయాలి. తర్వాత అందులో పెరుగు, తేనె కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది. అంతే కాకుండా ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి.
2. గుమ్మడికాయ, నిమ్మకాయ ఫేస్ ప్యాక్ :
కావలసినవి
గుమ్మడికాయ పేస్ట్- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 స్పూన్
విటమిన్ ఇ నూనె- 1
తయారీ విధానం: ఒక గిన్నెలో అన్ని పదార్థాలను కలపండి . తర్వాత దీనిని పేస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీన్ని వారానికి ఒకసారి అప్లై చేయండి. తర్వాత రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు.
3. గుమ్మడికాయ, దాల్చిన చెక్క ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
గుమ్మడికాయ గుజ్జు- 4-5 ముక్కలు
పాలు- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క పొడి- 1/2 టీస్పూన్
తయారీ విధానం:
ఒక గిన్నెలో పైన చెప్పిన అన్ని పదార్థాలను కలపండి. తర్వాత పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయండి. కొన్ని రోజుల్లో తేడా కనిపిస్తుంది.
Also Read: చుండ్రు సమస్యకు ఈ ఆయిల్‌తో.. శాశ్వత పరిష్కారం
4. గుమ్మడికాయ,ఎగ్ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
గుమ్మడికాయ గుజ్జు- 1/2 కప్పు
ఎగ్ తెల్లసొన- ఒక టేబుల్ స్పూన్
తేనె- ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను కలిపి మిక్స్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గుతాయి.