BigTV English

ICC ODI Team of Year: టీమిండియాకు అవమానం.. ICC ODI జట్టులో ఒక్కడూ లేడు ?

ICC ODI Team of Year: టీమిండియాకు అవమానం.. ICC ODI జట్టులో ఒక్కడూ లేడు ?

ICC ODI Team of Year: భారత జట్టుకు షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). 2024 సంవత్సరానికి గాను ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ { ICC men’s ODI team of the Year 2024} జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఒక్కరంటే ఒక్క భారతీయ ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. భారత్ మాత్రమే కాదు కీలక ఆటగాళ్లు కలిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన ఆటగాళ్లకు కూడా ఈ ఐసీసీ మెన్స్ ఒడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 జట్టులో చోటు దక్కలేదు.


Also Read: Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఉచితంగా స్టేడియంలోకి ఎంట్రీ ?

పాకిస్తాన్ కి చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే శ్రీలంక నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముగ్గురు ఈ అత్యుత్తమ వన్డే టీమ్ లో చోటు దక్కించుకున్నారు. ఇక వెస్టిండీస్ నుంచి ఒక్క ఆటగాడే ఎంపికయ్యాడు. టీమిండియా నుండి ఈ ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో ఒక్కరు కూడా ఎంపిక కాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు 2024 సంవత్సరం వన్డే ఫార్మాట్ లో అతి తక్కువ మ్యాచ్ లు ఆడడమే ఇందుకు కారణం.


2024లో భారత జట్టు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది. అయితే ఇందులో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు. శ్రీలంకతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ని భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. మరో మ్యాచ్ డ్రా గా ముగిసింది. 28 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది భారత జట్టు. ఇక ఐసీసీ ప్రకటించిన 2024 పురుషుల వన్డే జట్టులో శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

శ్రీలంక నుండి ఫాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, కుషాల్ మెండీస్, వానిందు హసరంగా లు చోటు దక్కించుకున్నారు. పాకిస్తాన్ నుండి నయీమ్ ఆయూబ్, షాహిన్ షా ఆఫ్రిది, హ్యారీ రౌఫ్ చోటు దక్కించుకున్నారు. ఇక ఆఫ్గనిస్తాన్ నుంచి రెహ్మానుల్లా గుర్బాజ్ జట్టు ఓపెనర్ గా చోటు దక్కించుకోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, గజన్ఫర్ ఎంపికయ్యారు. అలాగే వెస్టిండీస్ నుంచి ఫ్రెఫెన్ రూథర్ ఫోర్డ్ ఒక్కడే ఎంపికయ్యాడు.

ఐసీసీ వన్డే జట్లను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుండి భారత్ కి ప్రాతినిధ్యం లభించకపోవడం ఇది రెండవసారి. ఇక ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023లో టీమిండియా నుండి ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం గమనార్హం. కానీ 2024 మాత్రం భారత ఆటగాళ్లకు చేదును మిగిల్చిందనే చెప్పవచ్చు. భారత జట్టులో చెప్పుకోవడానికి ఎందరో అగ్రశేని ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది.

Also Read: Australian Open 2025: జకోవిచ్ కు ఎదురుదెబ్బ.. ఫైనల్‌కు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌.. !

ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: చరిత్ అసలంక (సి) (శ్రీలంక), సయీమ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్థాన్), పాతుమ్ నిస్సాంక (శ్రీలంక), కుసల్ మెండిస్ (WK) (శ్రీలంక), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్) ), వనిందు హసరంగా (శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది (పాకిస్థాన్), హరీస్ రవూఫ్ (పాకిస్థాన్), AM ఘజన్‌ఫర్ (ఆఫ్ఘనిస్తాన్).

 

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×