BigTV English

Balakrishna Movie Line-up: బాలకృష్ణ మూవీ లైనప్ చూశారా.. రికార్డ్స్ బద్దలు కొట్టడం గ్యారెంటీ..!

Balakrishna Movie Line-up: బాలకృష్ణ మూవీ లైనప్ చూశారా.. రికార్డ్స్ బద్దలు కొట్టడం గ్యారెంటీ..!

Balakrishna Movie Line-up.. నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఆరు పదుల వయసు దాటినా కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒక సినిమా తర్వాత మరొకటి ప్రకటిస్తూ అభిమానుల ఆనందానికి కారణమవుతున్నారు. అంతేకాదు ప్రతి సినిమాలో కూడా మాస్, యాక్షన్ పర్ఫామెన్స్ తో అందరిని కట్టిపడేస్తున్నారు. అంతేకాదు ఈ వయసులో కూడా యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్నారు అంటే సినిమాలపై బాలయ్యకు ఉన్న మక్కువ ఏంటో అర్థం అవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి (Bobby kolli)దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇక ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha shrinath), చాందిని చౌదరి(Chandini choudhury), ఊర్వశీ రౌతేలా((Urvashi Rautela) తదితరులు కీలకపాత్రలు పోషించారు.


ఇక ఈ సినిమా విజయం సాధించడంతో బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా బాలయ్య తదుపరి చిత్రాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల లైనప్ చూస్తే మాత్రం నిజంగా బాలయ్య ఖాతాలో మరికొన్ని రికార్డులు పడడం గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి బాలయ్య తదుపరిచిత్రాలు ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. గతంలో బోయపాటి శ్రీను (Boyapati Srinu)దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో అప్పట్లోనే సీక్వెల్ కూడా ప్రకటించారు. అలా ‘అఖండ -2’ రాబోతోంది. ఇప్పటికే మహాకుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో పాటు 2023లో బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని (Gopichandh malineni)దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. మాస్ చిత్రంగా ఈ సినిమా అటు బాలకృష్ణకు మంచి ఇమేజ్ అందించింది. ఇక అందుకే ఈ హిట్ కాంబో ని మళ్లీ రిపీట్ చేస్తున్నారు బాలయ్య. అందులో భాగంగానే ఈసారి #NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) ను కూడా రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత మరోసారి బాబీ డైరెక్షన్లోనే ఇంకో సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఈ మూడు సినిమాలతో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson dileep kumar) దర్శకత్వం వహిస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో బాలయ్య స్పెషల్ రోల్ చేస్తున్నారని, చెన్నై సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ (Rajinikanth)హీరోగా నటిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో శివరాజ్ కుమార్(Siva Raj Kumar) ,మోహన్ లాల్ (Mohan Lal) వంటి భారీ తారాగణం కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇలా ఈ నాలుగు సినిమాలతో సాలిడ్ లైనప్ తో అన్ స్టాపబుల్ గా రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు బాలయ్య.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×