BigTV English

Rainy season Health Drink: వర్షంలో తడిశారా?.. ఇది తాగితే దగ్గు, జలుబు దరిచేరవు!

Rainy season Health Drink: వర్షంలో తడిశారా?.. ఇది తాగితే దగ్గు, జలుబు దరిచేరవు!

Rainy season Health Drink| తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కరిశాయి. దీంతో చాలామంది అలర్జీ, ఇన్‌ఫెక్షన్, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైగా వర్షాల కారణంగా వాతావరణం చల్లగా మారింది. ఇలాంటి సమయంలో మీరు వర్షంలో తడిసినట్లైతే మీరు జలుబు, దగ్గు సమస్యలు పక్కాగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య ఇంట్లో చిన్ని చిట్లాతో నివారించవచ్చు.


ఒకవేళ మీరు వర్షంలో తడిసినట్లైతే మీరు వంటగదిలోని పదార్థాలతో ఒక పానీయం తయారు చేసుకొని వెంటనే తాగేస్తే.. ఇక జలబు లేదా దగ్గు మీ దరిచేరవు. అల్లం, తులసి, నల్ల మిరియాలు (బ్లాక్ పెప్పర్).. ఈ మూడింటిని నూరి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దగ్గు, జలబు మీ చెంతక చేరవు. ఈ పానీయం తాగితే వర్షాకాలంలో సాధారణంగా ఎదురయ్యే ఇతర అలర్జీలు కూడా తగ్గిపోతాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ పానీయం తీసుకుంటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ పానీయం వల్ల చాలా లాభాలున్నట్లు ఆయుర్వేద వైద్యులు సూచించారు.

ఆయుర్వేద వైద్యంలో తులసి ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. చాలా రోగాలు.. తులసి తీసుకోవడం వల్ల నయమవుతాయి. ముఖ్యంగా తులసి రసాన్ని టీ లో కలుపుకొని తాగుతారు. తులసి ఆకులు నూరి ఆ రసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగొచ్చు. జలుబు, దగ్గు ఉన్నవారికి ఈ పానీయం తాగితే ఉపశమనం లభిస్తుంది.


Also Read: నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా?.. ఈ డిటాక్స్ డ్రింక్ తో కరిగించేయండి..

తులసి, అల్లం, నల్లమిరియాల కషాయం ఎలా తయారు చేయాలంటే..
ఈ కషాయం తయారు చేయడానికి 6 లేదా 7 తులసి ఆకులు తీసుకోండి. సగం టీ స్పూన్ నల్ల మిరియాలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని.. ఈ మూడింటిని కలిసి బాగా నూరండి.

రెండు కప్పుల నీటిని పాల గిన్నెలో వేసి స్టవ్ పై పెట్టండి. అల్లం, తులిసి, నల్ల మిరియాల మిశ్రమాన్ని నీటిలో వేసి వేడి చేయండి. నీరు బాగా మరిగాక అందులో ఒక టీ స్పూన్ బెల్లం వేయండి.

రెండు నిమిషా తరువాత ఆ నీటిని ఫిల్టర్ చేసి టీ లాగా ఆస్వాదిస్తూ తాగేయండి. ఈ పానీయం తాగడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దాని వల్ల దగ్గు, జలుబు ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఈ పానీయం చాలా మేలు చేస్తుంది.

Also Read: గుండె పోటు, పక్షవాతం రాకుండా కాపాడే ఫుడ్స్ ఇవే..

వర్షా కాలమైనా, చలికాలమైనా వానలో తడిసినప్పుడు లేదా చలి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఈ కషాయం తయారు చేసుకొని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో తులసి, అల్లం, నల్ల మిరియాల కషాయం తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయంలోని యాంటి మైక్రోబియల్ గుణాలు గొంతు నొప్పి, మంట వంటి సమస్యలను దూరం చేస్తాయి.

వంటి నొప్పులు, జాయింట్ పెయిన్, కండరాల్లో వాపు సమస్యలున్నప్పుడు కూడా తులసి కషాయం మంచి పరిష్కారం. అల్లం, తులసి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. భోజనం తరువాత తులసి కషాయం తాగితే కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

ఇవే కాకుండా తులసి రసం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది, రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.

Also Read: చిన్న వయసులోనే డయాబెటీస్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×