Pimple Problem: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నుదుటిపై మొటిమలు రావడం సాధారణ సమస్య. ఇది ముఖ సౌందర్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా మీ ఆత్మ విశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో సరైన చికిత్సతో పాటు కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మొటిమల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.
ముఖంపై మొటిమలకు కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా చర్మంపై అదనపు నూనె ఉత్పత్తి, అంతే కాకుండా చర్మ రంధ్రాలు కూడా మూసుకుపోవడం. దీంతో పాటు క్రమ రహిత ఆహారపు అలవాట్లు, సరైన స్కిన్ కేర్ పాటించకపోవడం, మానసిక ఒత్తిడి ఈ సమస్యలను పెంచుతాయి. సరైన స్కిన్ కేర్ పాటించడం వల్ల కూడా మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు.
నుదిటిపై మొటిమలకు కారణాలు:
అధిక నూనె ఉత్పత్తి:
చర్మం అదనపు నూనెను ఉత్పత్తి అయినప్పుడు అది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా ఇది మొటిమలు రావడానికి కారణం అవుతుంది.
మురికి చేతులతో నుదురును పదే పదే తాకడం:
చాలా మంది తెలియకుండానే నుదురును పదే పదే తాకుతారు. దీని వల్ల చర్మంలో బ్యాక్టీరియా , మురికి పేరుకుపోయి మొటిమలు వస్తాయి.
చెడు ఆహారపు అలవాట్లు:
వేయించిన, కారంగా ఉండే ఆహారాలు తినడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. అధిక చక్కెర , పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను ఎక్కువవుతుంది.
ఒత్తిడి, నిద్ర లేకపోవడం:
మానసిక ఒత్తిడి , తగినంత నిద్ర లేకపోవడం కూడా హార్మోన్ల అసమ తుల్యతకు కారణమవుతాయి. ఇది మొటిమలకు ప్రధాన కారణం కావచ్చు.
హెయిర్ కేర్ ప్రొడక్ట్స్:
షాంపూ, కండిషనర్ లేదా హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు నుదిటి చర్మంపై ప్రభావం చూపుతాయి. వీటి వల్ల కూడా మొటిమలు వస్తాయి.
నుదిటిపై మొటిమలను తగ్గించడానికి మార్గాలు:
మీ ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి: తేలిక పాటి ఫేస్ వాష్‌తో రోజుకు రెండుసార్లు మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల అదనపు నూనె , మురికి తొలగిపోతుంది. తద్వారా మొటిమలు నివారిస్తాయి.
చేతులతో ముఖాన్ని ఎక్కువగా తాకండి:
ఎల్లప్పుడూ మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. బ్యాక్టీరియా సంక్రమణను నివారించడానికి మీ నుదిటిని పదే పదే తాకకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి.
సమతుల్య ఆహారం తీసుకోండి:
ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గింజలు తినడం, తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమల సమస్యను తగ్గిస్తుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి:
యోగా, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచి నిద్ర ఆరోగ్యకరమైన చర్మాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
Also Read: కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా ?
స్కిన్ కేేర్ ప్రొడక్ట్స్:
నూనె రహిత, నాన్-కామెడోజెనిక్ ఉత్పత్తులను వాడండి. తద్వారా ముఖంపై రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటుంది. అంతే కాకుండా మొటిమల సమస్య పెరగకుండా కూడా ఉంటుంది.
డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలి ?
నుదిటిపై మొటిమలు ఎక్కువ కాలం కొనసాగితే, లేదా తరచుగా వస్తుంటే.. డాక్టర్ ను సంప్రదించడం చాలా ముఖ్యం. మీ చర్మ తత్వాన్ని బట్టి డాక్టర్ సరైన మందులు, ట్రీట్‌మెంట్ సూచిస్తారు