BigTV English

Onions: కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా ?

Onions: కట్ చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా ?

Onions: ఉల్లిపాయలు దాదాపు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటాయి. రోజూ వివిధ రకాల వంటకాలను తయారు చేయడంలో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి,ఫైబర్ తో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.


ఇదిలా ఉంటే వంటకాలు తయారు చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఎక్కువగా ఉల్లిపాయలు కోస్తే.. వాటిని పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడతారు. కోసిన ఉల్లిపాయలను ఎక్కువ సేపు ఉంచితే.. అది మీ ఆరోగ్యానికి హానికరం. తరిగిన ఉల్లిపాయను ఎక్కువసేపు నిల్వ చేసి వాటిని తిరిగి ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించినా కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాక్టీరియా, వైరస్‌ల పెరుగుదల :


తరిగిన ఉల్లిపాయలు త్వరగా కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే దాని బయటి భాగం కోసిన తర్వాత వాతావరణంలోని బ్యాక్టీరియా , ఇతర హానికరమైన సూక్ష్మజీవులు దానిలో పెరుగుతాయి. ఉల్లిపాయలను మూత లేకుండా లేదా సరిగ్గా నిల్వ చేయకపోతే, అది బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. బ్యాక్టీరియా చేరడం వల్ల వాటితో తయారు చేసిన  పదార్థాలు కూడా త్వరగా పాడైపోతాయ్.

తేమ:

ఉల్లిపాయ తొక్కలో తేమ ఉంటుంది. తరిగిన ఉల్లిపాయలు త్వరగా తేమను గ్రహిస్తాయి. ఈ తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన వాతావరణాన్ని అందిస్తుంది. ఉల్లిపాయలను ఎక్కువసేపు కోసి పక్కన పెడితే అందులో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇవి ఇవి తినేటప్పుడు హాని కలిగిస్తాయి. ఈ బ్యాక్టీరియా అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. అంతే కాకుండా వివిధ రకాల ఇన్ఫ్లెక్షలకు కారణం అవుతుంది.

ఆరోగ్యంపై ప్రభావం:

తరిగిన ఉల్లిపాయను ఎక్కువ సేపు అలాగే ఉంచి తర్వాత వంటకాల తయారీలో వాడితే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు లేదా వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఉల్లిపాయలలో బ్యాక్టీరియా పెరిగి ఉంటే అది రోగనిరోధక శక్తిని కూడా బలహీన పరుస్తుంది.  రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ సేపు కట్ చేసిన ఉల్లిపాయలను నిల్వ చేయకూడదు. అంతే కాకుండా వాటిని తినకుండా కూడా ఉండాలి.

Also Read: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు !

విటమిన్ సి :

ఉల్లిపాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కానీ, ఉల్లిపాయను ఎక్కువసేపు కట్ చేసి అలాగే ఉంచినప్పుడు దానిలో ఉండే విటమిన్ సి పరిమాణం తగ్గుతుంది. దీని కారణంగా పోషకాల పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయ లేకపోతుంది.

వాసన, రుచిలో మార్పు :

తరిగిన ఉల్లిపాయను ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు, దాని వాసన , రుచి కూడా చెడిపోతుంది. ఈ కారణంగా, వీటిని తీసుకోవడం మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×