Kiwi Fruit In Breakfast: కివీ ఫ్రూట్ కేవలం రుచిలో మాత్రమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట కివీ ఫ్రూట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఉదయం పూట కివీఫ్రూట్ తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రేక్ ఫాస్ట్ సమయంలో.. కివీ ఫ్రూట్ తినడం వల్ల కలిగే లాభాలు:
1. విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది: ఒక చిన్న కివీ ఫ్రూట్ లో నారింజ పండు కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: కివీ ఫ్రూట్‌లో యాక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవడం వల్ల రోజు మొత్తం జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.
3. నిద్రలేమిని తగ్గిస్తుంది: కివీ ఫ్రూట్ లో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి మంచి నిద్ర పట్టడానికి సహాయ పడుతుంది.
4. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది: విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
5. కంటి ఆరోగ్యానికి మంచిది: కివీలో ఉండే లుటీన్, జియాక్సాంథిన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఇవి కంటి సమస్యలను నివారిస్తాయి.
6. బరువు తగ్గడంలో సహాయ పడుతుంది: కివీలో ఫైబర్ ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావన కలిగించి, అనవసరమైన ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది.
Also Read: ఎగ్స్ Vs పన్నీర్.. ఉదయం పూట ఏది తింటే బెటర్ ?
7. గుండె ఆరోగ్యానికి మంచిది: కివీ ఫ్రూట్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుందిజ అందుకే ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
8. పేగుల ఆరోగ్యానికి మంచిది: కివీ ఫ్రూట్‌లో ఉండే పీచు పదార్థం పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయప డుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
9. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది: కివీ ఫ్రూట్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని సురక్షితంగా తినవచ్చు.
10. శక్తిని పెంచుతుంది: ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇది రోజు మొత్తం ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.