రాత్రి పూట ఏడుగంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయిన వారిలో బీపీ పెరుగుదల కూడా ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తెలిసింది. బీపీ పెరిగిందంటే మీ గుండెకు రక్షణ కరువైనట్టే. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరిగిపోతాయి. కచ్చితంగా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
అలారం మిమ్మల్ని గాఢ నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొలుపుతుంది. దీనివల్ల ‘నిద్రా జడత్వం’ ఏర్పడుతుంది. ఒక రెండు గంటల పాటు మీరు గజిబిజిగా ఉంటారు. ఆ సమయంలో ఒత్తిడి స్థాయిలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్లే రక్తపోటు కూడా పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం అత్యంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. అది రక్తనాళాల గోడలను గుద్దుకుంటూ ప్రవహిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు అలారం అలవాటును మానుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకుంటే మీకు అలారం అవసరమే ఉండదు.
చీకటి గదిలో నిద్రపతే ఎప్పుడు తెల్లవారిందో తెలుసుకోవడం కష్టమే. అలాంటి వారే ఎక్కువగా అలారాన్ని వాడతారు. అలా కాకుండా సహజంగా కాంతి మీ గదిలోకి వచ్చేటట్టు చూసుకోండి. దీనివల్ల తెల్లవానగాపూ ఆ కాంతి మీ శరీరాన్ని చేరుతుంది. మీ మెదడులో స్లీప్ హార్మోన్ అయినా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మీరు సహజంగానే మేల్కొంటారు. ప్రతిరోజూ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయే వారిలో అలారం పెట్టాల్సిన అవసరం లేదని తేలింది. అలాగే ఎవరైతే ఒకే నిద్రా సమయాలను పాటిస్తారో వారికి కూడా అలారం అవసరం లేదు.
అలారం నుంచి వచ్చే పెద్ద శబ్దం వల్ల సౌండ్ స్లీప్ అకస్మాత్తుగా అంతరాయం కలుగుతుంది. ఇది మీలో భయాందోళనలను పెంచుతుంది. కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోను. ఇది ఎప్పుడైతే ఉదయాన్నే పెరుగుతుందో మీకు ఆ రోజంతా చిరాకుగా, ఆత్రుతగా, కోపంగా ఉంటుంది. ఉదయాన ప్రశాంతంగా లేచిన వారే ఆ రోజంతా ప్రశాంతంగా పనులు చేయగలుగుతారు.
ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు నిద్రపోయి, ఉదయం ఆరు గంటలకి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. ఇది ఎంతో ఉత్తమ నిద్రా సమయాలు. ఆ రాత్రి నిద్ర కూడా మీ శరీరానికి సరిపోతుంది. మానసికంగా, శారీరకంగా మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది మీలో ఒత్తిడిని, హృదయ స్పందన రేటును అదుపులో ఉంచుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉదయం నిద్ర లేవడం వల్ల ఆనందంగా జీవించగలుగుతారు.