E-Paper
Advertisement

టాయిలెట్ క్లీనింగ్‌కు ఈ ఒక్కటి చాలు..15 నిమిషాల్లో గారపట్టిన మరకలన్నీ క్లీన్!

టాయిలెట్ క్లీనింగ్‌కు ఈ ఒక్కటి చాలు..15 నిమిషాల్లో గారపట్టిన మరకలన్నీ క్లీన్!
Advertisement

Natural Toilet Cleaning Hacks: ఇల్లు ఎంత నీట్‌గా ఉంచినా.. బాత్‌రూమ్‌లో టాయిలెట్ బౌల్ లోపల గోధుమ రంగు మరకలు ఉంటే.. అస్సలు నచ్చదు. చాలా మంది ఇవి మామూలు మురికి అనుకుని రోజూ బ్లీచింగ్ లిక్విడ్స్ వేసి గట్టిగా రుద్దుతుంటారు. కానీ.. ఎంత క్లీన్ చేసినా ఆ మరకలు మళ్లీ మళ్లీ వచ్చేస్తుంటాయి. నిజానికి అవి సాధారణ మురికి కాదు.. నీటి వల్ల పేరుకు పోయే లైమ్‌స్కేల్ , రస్ట్ మరకలు. మరి ఎలాంటి ఘాటైన కెమికల్స్, బ్లీచింగ్ వాడకుండా కేవలం ఒకే ఒక్క సాధారణ వస్తువుతో కేవలం 15 నిమిషాల్లో ఈ మొండి మరకలను ఎలా వదిలించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లీచింగ్ ఎందుకు పని చేయదు?

Advertisement

మనం సాధారణంగా వాడే బ్లీచింగ్ లిక్విడ్స్ టాయిలెట్‌లోని బ్యాక్టీరియాను చంపడానికి, ఆ గోధుమ రంగు మరకలను తాత్కాలికంగా తెల్లగా మార్చడానికి మాత్రమే పని కొస్తాయి. బ్లీచింగ్ వేసినప్పుడు మరకలు పోయినట్లు అనిపించినా.. లోపల పేరుకుపోయిన ఖనిజ లవణాలు అలాగే ఉంటాయి. దీని వల్ల కొద్ది రోజులకే ఆ మరకలు మళ్లీ మరింత ఘోరంగా తయారవుతాయి. అంతే కాదు.. ఈ లైమ్‌స్కేల్ పొరల మధ్య బ్యాక్టీరియా, బూజు చాలా ఈజీగా చేరుకుంటాయి.

15 నిమిషాల మ్యాజిక్ క్లీనింగ్ ప్రాసెస్:
ఈ సింపుల్ ట్రిక్‌ను మీరు ఎలా ఉపయోగించాలో ఇక్కడ స్టెప్-బై-స్టెప్ చూద్దాం.

Advertisement

స్టెప్ 1: ముందుగా టాయిలెట్ బౌల్‌లో ఎక్కడైతే గోధుమ రంగు గార మరకలు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ నీళ్లు లేకుండా వీలైనంత వరకు డ్రైగా చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు ఒకటి లేదా రెండు కప్పుల ప్యూర్ వైట్ వినెగర్‌ను తీసుకుని.. ఆ మరకలు ఉన్న ప్రాంతంలో బాగా పోయండి.

స్టెప్ 3: వెనిగర్ పోసిన తర్వాత దాన్ని అలాగే 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయండి. మరకలు మరీ మొండిగా ఉంటే గంట పాటు లేదా రాత్రంతా కూడా అలానే ఉంచేయవచ్చు. వెనిగర్  ఆ హార్డ్ వాటర్ మరకలను లూజ్ చేస్తుంది.

స్టెప్ 4: సమయం అయిపోయాక.. టాయిలెట్ బ్రష్ తీసుకుని లైట్‌గా స్క్రబ్ (రుద్దడం) చేయండి. కెమికల్స్ వాడినప్పుడు పడే కష్టం లేకుండా.. ఆ బ్రౌన్ మరకలన్నీ చాలా ఈజీగా ఊడిపోతాయి. చివరగా ఫ్లష్ చేస్తే మీ టాయిలెట్ సరికొత్తగా మెరిసి పోతుంది.

ఈ టిప్ వల్ల లాభాలు:
నో కెమికల్స్: మార్కెట్లో దొరికే యాసిడ్స్, బ్లీచింగ్ లాగా దీని నుంచి ఎలాంటి ఘాటైన వాసన రాదు. కళ్లకు, చర్మానికి చాలా సురక్షితం.

తక్కువ ఖర్చు: వందల రూపాయల క్లీనర్స్ కంటే వినెగర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.

లాంగ్ లాస్టింగ్ క్లీన్‌నెస్: ఇది లైమ్‌స్కేల్‌ను బేస్ నుండి క్లీన్ చేస్తుంది కాబట్టి.. మరకలు మళ్లీ అంత త్వరగా రావు.

కెమికల్ క్లీనర్లతో మీ చేతులను, టాయిలెట్ పింగాణీని పాడుచేసుకునే కంటే, ఈసారి ఈ సింపుల్ వెనిగర్ ట్రిక్‌ను ట్రై చేసి చూడండి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చాలు, మీ బాత్‌రూమ్ ఎప్పుడూ హైజీనిక్‌గా,  సరికొత్తగా మెరుస్తూ ఉంటుంది.

Tags

Related News

దోమలను చంపేందుకు కొత్త దోమలు.. 6 లక్షల స్పెషల్ దోమలు విడుదల

NEET Counselling: నీట్ 2026 కౌన్సిలింగ్.. ఎంబిబిఎస్ అడ్మిషన్ స్టేట్ కోటాకు మీకు అర్హత ఉందా?

తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ వెంటనే ఆకట్టుకుంటారు

టీనేజ్ పిల్లలతో స్నేహం చేసేందుకు కొత్త విధానం.. తల్లిదండ్రులు ఫాలో అవుతున్న న్యూ ట్రెండ్

మాటల్లేవ్, టిచింగ్ అసలే లేదు.. దంపతుల మధ్య ఈ 5 సంకేతాలు కనిపిస్తే సైలెంట్ డివోర్స్

ఆరోగ్యానికి సూచిక శరీర బరువు కాదు.. ఊబకాయం కొలిచేందుకు కొత్త ఫార్ములా

చేపల్లో వేగంగా వ్యాపించే అరుదైన క్యాన్సర్.. ఆందోళన వ్యక్తం చేసిన శాస్త్రవేత్తలు

సిగరెట్ అలవాటు లేకపోయినా ఊపిరితిత్తుల క్యాన్సర్.. వైద్యులు చెబుతున్న అసలు కారణాలివే!

Big Stories

Advertisement
×