E-Paper
Advertisement

Shahid Afridi: పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే, అర్జున్ ప్ర‌తీ మ్యాచ్ లోనూ ఆడేవాడు

Shahid Afridi: పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే, అర్జున్ ప్ర‌తీ మ్యాచ్ లోనూ ఆడేవాడు
Advertisement

Shahid Afridi:  క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నతనంలోనే టీమిండియాలోకి వచ్చిన సచిన్ టెండూల్కర్ (SACHIN TENDULKAR)… జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టన్నుల కొద్ది పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ గా పేరు తెచ్చుకున్నాడు సచిన్. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో అతన్ని కొనుగోలు చేసినప్పటికీ, ముంబై ఇండియన్స్ అలాగే లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్ కెరీర్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండుల్కర్ ఫ్యామిలీ పాకిస్తాన్ లో పుట్టి ఉంటే.. అర్జున్ టెండూల్కర్ కెరీర్ ఓ రేంజ్ కు వెళ్లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా అర్జున్ టెండూల్కర్ కు ( ARJUN TENDULKAR) అవకాశం దక్కేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

పాకిస్తాన్ లో స‌చిన్ పుట్టింటే, అర్జున్ ప్ర‌తీ మ్యాచ్ లోనూ ఆడేవాడు

Advertisement

టీమిండియా కు ఎన్నో విజయాలు అందించిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ కొడుకుగా ఉన్నప్పటికీ కూడా అతనికి టీమిండియాలో అవకాశం రావడం లేదు. అంతెందుకు ఐపిఎల్ టోర్నమెంట్ లో అతనికి అవకాశం ఇవ్వడం లేదు ఫ్రాంచైజీలు. ఇలాంటి క్రమంలో అర్జున్ టెండూల్కర్ కెరీర్ పై షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశారు. అర్జున్ టెండూల్కర్ సచిన్ కుమారుడు అయినప్పటికీ కూడా అతనికి అవకాశాలు ఇవ్వకుండా బీసీసీఐ తొక్కేస్తోందని ఆగ్రహించారు. అదే పాకిస్తాన్ లో సచిన్ పుట్టి ఉంటే, అర్జున్ టెండూల్కర్ కు అనేక అవకాశాలు వచ్చే వంటూ హాట్ కామెంట్స్ చేశారు.

పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ లో కూడా అర్జున్ టెండూల్కర్ ను ఆడించే వాళ్ళమని స్పష్టం చేశారు. పాకిస్తాన్ లో మామ పోతే అల్లుడు.. అల్లుడు పోతే మామ అన్నట్లుగా పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. బంధుమిత్రులకు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అవకాశం ఇస్తారని వెల్లడించారు. కానీ టీమిండియాలో మాత్రం పరిస్థితి వేరే లాగా ఉంటుందని స్పష్టం చేశారు. సచిన్ లాంటి దిగ్గజ క్రికెటర్ కుమారుడికి కూడా బీసీసీఐ అవకాశాలు ఇవ్వదని.. టాలెంట్ ఉన్నవాళ్ళకు మాత్రమే ఇస్తుందని ప్రకటించారు. అలాంటి ధోరణితో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుకు వెళితే, మంచి ఫలితాలు రాబట్టవచ్చని షాహిద్ ఆఫ్రిది స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

Related News

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి

టీమిండియాను వ‌దిలేసి, మ‌రో దేశానికి సంజు శాంస‌న్ ఆడితే బెట‌ర్‌

నిల‌క‌డ లేదు, 50 మ్యాచ్ ల‌కో మంచి ఇన్నింగ్స్ ఆడ‌తాడు..సంజుపై షాహిద్ అఫ్రిది వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఆ రోజున డ్రెస్సింగ్ రూంలో ధోని వెక్కి వెక్కి ఏడ్చాడు..చాహ‌ల్ సంచ‌ల‌నం

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ భారీ కుట్ర‌..4 జ‌ట్లుగా విడిపోయి మ‌రీ

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు

ఆ డ్రింక్ తాగి ఉమ్మేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ..కోహ్లీ ఫ్యాన్స్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×