E-Paper
Advertisement

Smart Glasses: కంటిపై లెన్స్, ముఖానికి అద్దాలు.. తర్వాత జరిగే అద్భుతమే వేరు..!

Smart Glasses: కంటిపై లెన్స్, ముఖానికి అద్దాలు.. తర్వాత జరిగే అద్భుతమే వేరు..!
Advertisement

Smart Glasses: సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందుతున్న వేళ.. వైద్య రంగంలోనూ ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దృష్టి లోపాలతో బాధపడుతున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు ‘ఇన్నోవేగా’ (Innovega) సంస్థ సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ ప్రాజెక్టుతో ముందుకు వచ్చింది. సాధారణ కంటి అద్దాల రూపంలో ఇవి కనిపిస్తూనే పాక్షిక దృష్టి లోపం ఉన్నవారికి స్పష్టమైన చూపును అందించడం ఈ సరికొత్త ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశంగా ఉంది.

ఏమిటీ ఇన్నోవేగా స్మార్ట్ గ్లాసెస్?

ఇన్నోవేగా సంస్థ రూపొందించిన ఈ డిజిటల్ అద్దాలు.. ఒక గాడ్జెట్ మాత్రమే కాకుండా అత్యాధునిక ‘విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్’ సిస్టమ్ గా కూడా పనిచేయనుంది. వీటిని స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్‌లతో పాటు ప్రత్యేకమైన గ్లాసెస్‌ను కలిపి తయారు చేశారు. ఈ అద్దాలలో అమర్చిన మైక్రో OLED డిస్‌ప్లేలు, కెమెరాల సహాయంతో కంటికి కనిపించే దృశ్యాలను మరింత స్పష్టంగా, పెద్దవిగా, మెరుగైన కాంట్రాస్ట్‌తో యూజర్లకు చూపిస్తాయి.

ఇది ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఈ సాంకేతికత రెండు ముఖ్య భాగాల కలయికతో పనిచేసయనుంది. అందులో ప్రధానమైనది సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ కాగా రెండోది స్మార్ట్ గ్లాసెస్. సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ విషయానికి వస్తే.. ఇవి దూరం నుంచి వచ్చే కాంతిని, స్మార్ట్ గ్లాసెస్ స్క్రీన్ నుంచి వచ్చే డిజిటల్ సమాచారాన్ని ఒకే సమయంలో కంటి రెటీనాపై ఫోకస్ చేయడానికి సహాయపడతాయి. స్మార్ట్ గ్లాసెస్ విషయానికి వస్తే.. ఈ అద్దాలలో ఉండే కెమెరాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని రికార్డ్ చేసి, హై-డెఫినిషన్ (HD) రూపంలో కాంటాక్ట్ లెన్స్‌ల ద్వారా కంటికి చూపిస్తాయి. ఫలితంగా దృష్టి లోపం, గ్లాకోమా, మాక్యులర్ డీజెనరేషన్ వంటి సమస్యలతో బాధపడేవారు కూడా తమ ముందున్న వస్తువులను, పుస్తకాల్లోని అక్షరాలను స్పష్టంగా చూడగలుగుతారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

స్మార్ట్ కళ్లద్దాల బెనిఫిట్స్..

సాధారణంగా చూపు తక్కువగా ఉన్నవారు పేపర్లు చదవాలన్నా, కంప్యూటర్ స్క్రీన్లు చూడాలన్నా, ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇన్నోవేగా స్మార్ట్ గ్లాసెస్ ద్వారా ఈ సమస్యలకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే అడ్డంకులను సులభంగా గుర్తించవచ్చు. బోర్డులపై ఉండే అక్షరాలను, సైన్ బోర్డులను స్పష్టంగా చదవవచ్చు. ముఖాలను గుర్తించడం, రోజూవారి పనులను తామంతట తామే స్వతంత్రంగా చేసుకోవడం వీటి ద్వారా సులువవుతుంది.

Advertisement

Also Read: సోలార్ స్మార్ట్ గొడుగు.. ఎండ నుంచి రక్షణే కాదు.. ఫోన్‌కి ఛార్జింగ్ కూడా..!

మార్కెట్లోకి ఎప్పుడు?

ఇన్నోవేగా సంస్థ.. ఈ స్మార్ట్ గ్లాసెస్ ను ప్రయోగాత్మక దశలో భాగంగా తొలుత 100 మాత్రమే తయారు చేసింది. వీటిని 2950 డాలర్లు (సుమారు రూ.2,81,908)కు విక్రయించింది. అవన్నీ సేల్ కావడంతో మరో 1000 స్మార్ట్ గ్లాసెస్ కు సంబంధించి.. కంపెనీ ఆర్డర్ తీసుకుంటోంది. కస్టమర్ల నుంచి వచ్చే రివ్యూల ఆధారంగా స్మార్ట్ గ్లాసెస్ లో మరికొన్ని మార్పులు చేసి.. 2027 ప్రారంభం నుంచి మార్కెట్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఇన్నోవేగా సీఈఓ స్టీవ్ విల్లీ వెల్లడించారు.

Also Read: రీఛార్జ్ ధరలు పెరగట్లేదా? బయటి ప్రచారం ఉత్తిత్తిదేనా.. ఫుల్లు క్లారిటీ వచ్చిందోచ్!

Related News

సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!

భారత్‌లోకి వచ్చేస్తున్న iQOO Z11.. 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, కొత్త ప్రాసెసర్‌తో దుమ్ము రేపనుంది!

వావ్.. ఇదే కదా టెక్ లవర్స్ కోరుకున్నది.. ఒకే పవర్ బ్యాంక్‌తో వాచ్, ఫోన్ ఒకేసారి ఛార్జ్!

ఓటీటీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ. 200 కే 20కి పైగా ఓటీటీలు.. వర్త్ వర్మా వర్త్!

200MP కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో OnePlus 16.. భారత్‌లో లాంచింగ్ లేనట్టేనా?

మైక్రోవేవ్ వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం నాశనమే!

ప్రయాణాల్లో ఛార్జింగ్ తిప్పలు ఇక ఉండవు! రూ.వేయ్యిలోపు బ్రాండెడ్ పవర్ బ్యాంక్

20 గంటల ప్లేబ్యాక్, అదిరిపోయే సౌండ్! మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్

Big Stories

Advertisement
×