BigTV English

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Rice cream for face: నేటి యువత చర్మ సంరక్షణకు ఎంతో విలువనిస్తున్నారు. చర్మం సీజన్‌ను బట్టి మారిపోతూ ఉంటుంది. కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. కాబట్టి చర్మం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొరియన్ గ్లాస్ స్కిన్ పొందడానికి ఎంతో మంది అమ్మాయిలు రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. కొరియన్లు చర్మ సంరక్షణకు ముఖ్యంగా వాడేది బియ్యం.


ఎందుకంటే బియ్యంలో రైస్ బ్రాన్, స్క్వేలీన్, ట్రైసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఏజెంట్ లక్షణాలు ఎక్కువ. అలాగే స్కిన్ తెల్లగా మార్చే గుణం కూడా ఉంది. మాయిశ్చరైజింగ్ ఏజెంట్లను కూడా బియ్యం కలిగి ఉంటుంది. కాబట్టి చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి బియ్యంతో చేసిన క్రీమ్‌ను వాడితే ఎంతో మంచిది. ఈ రైస్ క్రీమ్‌ను ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీన్ని చర్మానికి రాసుకోవడం వల్ల మొటిమలు, నల్లటి వలయాలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

రైస్ క్రీమ్ చేయడానికి బియ్యాన్ని బాగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే అలోవెరా జెల్‌ను కూడా నాలుగు స్పూన్లు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల తేనె రెడీ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఉడికించిన అన్నాన్ని వేసి చేతితోనే చాలా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అలోవెరా జెల్, తేనె కూడా వేసి బాగా కలిపి క్రీం లాగా చేసుకోవాలి. అంతే రైస్ క్రీమ్ రెడీ అయినట్టే.


అలోవెరా జెల్ మీకు దొరకకపోతే దోసకాయ రసం వాడుకోవచ్చు. ముఖాన్ని శుభ్రంగా కడిగి దానికి ఈ రైస్ క్రీమ్‌ను అప్లై చేసుకోవాలి. ఒక పావుగంట పాటు వదిలేసి తర్వాత ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒకసారి రైస్ క్రీమ్ తయారు చేసుకుంటే నాలుగు రోజులు పాటు వస్తుంది. దీన్ని ప్రతిరోజూ ముఖానికి అప్లై చేయడం వల్ల వారం రోజుల్లోనే మీకు మంచి ప్రభావం కనిపిస్తుంది.

బ్యూటీ పార్లర్లకు వెళ్లి వందలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రైస్ క్రీమ్ ఉపయోగించి చూడండి. వారం రోజుల్లో మీ చర్మంలో అందమైన మార్పులను గమనిస్తారు. కాస్త ఓపికగా ఆ రైస్ క్రీమ్‌ను ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు.

Also Read: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం

ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోండి. తేనె ఒక బాటిల్ కొనుక్కుంటే సరిపోతుంది. ప్రతి ఇంట్లో కూడా బియ్యం ఉంటాయి. కాబట్టి బియ్యాన్ని చాలా మెత్తగా ఎక్కువ నీళ్లు పోసి ఉడికించుకోండి. బియ్యం ఉడికించిన నీటిని పడేయాల్సిన అవసరం లేదు. ఆ నీటిని జుట్టుకు పట్టించడం ద్వారా వెంట్రుకలను కూడా మెరిసేలా చేయవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×